తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Forbes Cover Page: ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై రామ్ చ‌రణ్ దంపతులు

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చ‌రణ్ దంపతులు అరుదైన ఘనత సాధించారు. ఫేమస్ బిజినెస్ మ్యాగజైన్ అయిన ఫోర్బ్స్ ఇండియా ప్రకటించిన లేటెస్ట్ ఎడిషన్‌ కవర్‌పేజీపై ఇద్దరు దర్శనమిచ్చారు. అయితే ఇప్పటివరకు ఏ టాలీవుడ్ జంట ఇలా ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించలేదు.

ALSO READ: ‘సౌండ్‌ ఆఫ్‌ సలార్’ రిలీజ్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న వీడియో

కవర్ పేజీపై సూపర్ కపుల్..

ఫోర్బ్స్ మ్యాగజైన్ ఇంట‌ర్వ్యూలో భాగంగా ఈ ఫొటో షూట్ జ‌రగగా.. సూపర్ కపుల్ అంటూ కవర్ పేజీపై క్యాప్ష‌న్ ఇచ్చారు. మొదటి సారి తన భార్య ఉపాసనతో కలిసి రామ్ చరణ్ ఫోర్బ్స్ మ్యాగజైన్ పేజీపై దర్శనమివ్వడంతో మెగా అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం చరణ్‌, శంకర్‌ కాంబోలో ‘గేమ్‌ ఛేంజర్‌’ వస్తోంది. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. దిల్‌రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కాగా, ఈ సినిమా వచ్చే ఏడాదిలో రిలీజ్‌ కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button