తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Rambha: సినిమాల్లోకి రంభ రీ ఎంట్రీ.. స్టార్ హీరోతో మూవీ?

ఇప్పటికే చాలా మంది సీనియర్ బ్యూటీలు ఇప్పుడు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు టాలీవుడ్ ప్రేక్షకులను ఊపేసిన నటీమణుల్లో రంభ ఒకరు.. రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన ఆ ఒక్కటీ అడక్కు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.

ఆ సినిమాలో రంభ తన నటనతో పాటు అందాలతో కవ్వించింది. ఆతర్వాత వరుస సినిమాలతో బిజీ అయిపొయి.. చాలా సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. అప్పట్లోనే అందాలు ఆరబోసి కుర్రకారుకు కిర్రెక్కించిన రంభ అసలు పేరు విజయలక్ష్మి. అయితే మొదటి సినిమా దర్శకుడు అయిన ఈవీవీ సత్యనారాయణ ఆమె పేరును రంభగా మార్చారు. తెలుగులోనే కాదు.. తమిళ్, కన్నడలోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. అదేవిధంగా హీరోయిన్ గానే కాకుండా స్పెషల్ సాంగ్స్ లోనూ స్టెప్పులేసి అదరగొట్టారు.

పెళ్లి తర్వాత రంభ సినిమాలకు దూరమయ్యారు. మలేషియా వ్యాపారవేత్తను ఈ బ్యూటీ వివాహం చేసుకున్నారు. వయసు పెరుగుతున్నా కూడా తరగని అందంతో ఆకట్టుకుంటున్నారు. ఇక ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు తిరిగి సినిమాల్లో బిజీ కానున్నారని తెలుస్తోంది.

ఇక ఇప్పుడు రంభ కూడా రీ ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. త్వరలోనే టాలీవుడ్ బడా హీరో సినిమాలో కీలక పాత్రలో రంభ కనిపించనున్నారని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక సీనియర్ హీరోయిన్స్ లో రాశి, ఆమని, ఇంద్రజ, కుష్బు లాంటి వారు రీ ఎంట్రీలు ఇచ్చి రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వారి బాటలోనే రంభ కూడా సినిమాల్లో నటించనున్నారని టాక్ వినిపిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button