తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Ravi Teja: కొత్త బిజినెస్ పై రవితేజ దృష్టి…. అభిమానుల శుభాకాంక్షలు

టాలీవుడ్‌ హీరోలు చాలామంది తమ వృత్తితో బిజీగా ఉంటూనే పలు వ్యాపార రంగాల్లోనూ రాణిస్తున్నారు. స్టార్‌ హీరోలు అంతా థియేటర్స్‌ బిజినెస్‌పై దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే మహేశ్‌ బాబు, అల్లు అర్జున్‌ , విజయ్‌ దేవరకొండ అత్యాధునిక టెక్నాలజీతో సుందరమైన థియేటర్స్‌ను నెలకొల్పారు. ఇప్పుడు అదే బాటలో మాస్‌ మహారాజా రవితేజ కూడా వెళ్లబోతున్నట్లు సమాచారం.

Also Read: బిగ్ బాస్ ఫేమ్ షణ్మఖ్ అరెస్ట్.. అసలు కథేంటి?

రవితేజ ఏషియన్‌ సినిమాస్‌ వారితో కలిసి ఒక మల్టీఫ్లెక్స్‌ను హైదరాబాద్‌లో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆరు స్క్రీన్స్ వుంటాయి. దిల్‌సుఖ్‌నగర్‌లో త్వరలో ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ మల్టీప్లెక్స్‌కు ఏషియన్‌ రవితేజ పేర్లు కలిసి వచ్చేలా ‘ART’ సినిమాస్‌ అనే పేరు పెట్టబోతున్నట్లు తెలిసింది.

Also Read: నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అంటున్న శ్రీవిష్ణు… ‘ఓం భీమ్ బుష్’ పోస్టర్ రిలీజ్

ఇటీవలే ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. మిరపకాయ్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత రవితేజ, హరీష్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button