తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Saindhav: వెంకటేశ్ 75వ మూవీ… సైంధవ్ ట్రైలర్ రిలీజ్

వెంకటేశ్ – శైలేశ్ కొలను కాంబినేషన్లో రూపొందిన ‘సైంధవ్’ సినిమా ఈ నెల 13న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. కెరియర్ పరంగా వెంకటేశ్ కి ఇది 75వ సినిమా. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి వ‌చ్చిన టీజ‌ర్‌తో పాటు పాట‌లకు ఆడియోన్స్ నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. వెంకట్ బోయినపల్లి నిర్మించిన ఈ సినిమా నుంచి, కొద్ది సేపటి ముందు ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

Also Read: ‘హను మాన్’మూవీ… రామదూత స్తోత్రం రిలీజ్!

ఈ కథ తండ్రీ కూతుళ్ల మధ్య గల ఎమోషన్స్ నేపథ్యంలో నడుస్తుందనే విషయం అర్థమవుతోంది. హీరో కూతురు నరాలకు సంబంధించిన ఒక అరుదైన వ్యాధితో బాధపడుతూ ఉంటుంది. అందుకు అవసరమైన ఇంజక్షన్ ఖరీదు 17 కోట్లు. ఆ పాప మాత్రం తన కోసం తండ్రి ఏదైనా చేయగలడు .. తన తండ్రి ఉండగా తనకేం కాదు అనే నమ్మకంతో ఉంటుంది. ఆ ఇంజక్షన్ హీరోకి దొరక్కుండా కొంతమంది స్వార్థపరులు అడ్డుకుంటూ ఉంటారు. అప్పుడు హీరో ఏం చేశాడనే అంశం చుట్టూ ఈ కథ ఉండబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

Also Read: సైబర్ కేటుగాళ్ల వలలో ప్రముఖ నటి… ఎంత పొగొట్టుకుందంటే?

ఈ సినిమాలో వెంకటేశ్ సరసన శ్రద్ధా శ్రీనాథ్ నటించగా, మిగతా ముఖ్యమైన పాత్రలలో ఆర్య , ముఖేశ్ రుషి , నవాజుద్దీన్ సిద్ధికీ, జిషు సేన్ గుప్తా, రుహాని శర్మ, ఆండ్రియా కనిపించనున్నారు. ఈ పాన్ ఇండియా మూవీని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి భారీ స్థాయిలో నిర్మిస్తుండ‌గా, సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button