తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Salaar: ప్రాణస్నేహితులు బద్ధశత్రువులు అయ్యారు…’సలార్’ రిలీజ్ ట్రైలర్

ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సలార్ రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ థియేట్రికల్ ట్రైలర్ ను చిత్రబృందం ఎట్టకేలకు విడుదల చేసింది. ఇప్పుడీ రిలీజ్ వెర్షన్ ట్రైలర్ చూస్తే ప్రభాస్ క్యారెక్టర్ విషయంలో మరికాస్త స్పష్టత వచ్చింది. ప్రభాస్ ఇందులో ఓ మెకానిక్ గా కనిపించనున్నారు. రెంచీలు తిప్పడమే కాదు, తుపాకీ కాల్చడం, పదునైన కత్తులతో విరుచుకుపడడం కూడా తనకు తెలుసని చాటారు.

Also Read: వరుణ్ తేజ్ కొత్త మూవీ సాలిడ్ అప్‌డేట్.. ఆసక్తి రేకెత్తించేలా టీజర్‌

ట్రైలర్ చివర్లో ఓ ట్విస్ట్ కూడా ఇచ్చారు. ఇద్దరు ప్రాణస్నేహితులు బద్ధశత్రువులుగా మారడమే ఖాన్సార్ కథను మార్చింది అంటూ వాయిస్ ఓవర్ తో చెప్పించారు. దాంతో ఈ చిత్రంపై ఆసక్తి పెరిగేలా చేశారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్, శ్రుతిహాసన్ జంటగా సలార్: సీజ్ ఫైర్ చిత్రాన్ని రూపొందించారు. ఈ నెల 22న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న సలార్ మొదటి పార్టుకు A సర్టిఫికెట్ ఇచ్చారు. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, టినూ ఆనంద్, ఈశ్వరీరావు, శ్రియా రెడ్డి, గరుడ రామ్ కీలక పాత్రలు పోషించారు. రవి బస్రూర్ సంగీతం అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button