తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Sharwanand: శర్వానంద్ కొత్త మూవీ స్టార్ట్.. ఈసారైనా హిట్టు కొడతాడా?

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ కు ఈ మధ్య ఒక్క హిట్ సినిమా కూడా లేదు. రెండేళ్లుగా ఒక్క హిట్ సినిమా కూడా లేదని తెలుస్తుంది. అయితే ఇప్పుడు సైలెంట్ గా కొత్త సినిమా షూటింగ్ పనులను మొదలు పెట్టాడు. 2022లో ‘ఒకే ఒక జీవితం’ మూవీతో వచ్చి సూపర్ హిట్టు అందుకున్న శర్వానంద్.. ఇప్పుడు ఈ సినిమాను చేస్తున్నారు. తన పెళ్లి అవ్వడంతో సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన ఆయన ఇప్పుడు కొత్త సినిమా షూటింగ్ లో బిజీ అయ్యాడు.

Also read: Allari Naresh: అల్లరి నరేష్ మూవీ అప్డేట్.. కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు

గత ఏడాది సూపర్ హిట్ కొట్టిన దర్శకుడితో సినిమా చేస్తున్నాడు. గత ఏడాది శ్రీవిష్ణుతో ‘సామజవరగమన’ సినిమా తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్టుని అందుకున్న రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శర్వానంద్ తన 36వ సినిమాని చేయబోతున్నారట. ఇక ఈ సినిమాలో నేచురల్ నటి మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ నిర్మించబోతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

ఎటువంటి హడావుడి లేకుండా లాంచ్ అయిపోయింది. అలాగే షూటింగ్ ని కూడా మొదలు పెట్టేశారని తెలుస్తుంది. ఈ ఏడాది మార్చి నుంచి మొదటి వారం వరకు ఈ మూవీ మొదటి షెడ్యూల్ జరుగుతుందని చెబుతున్నారు. కాగా ఈ సినిమాలో మాళవిక నాయర్ తో పాటు సంయుక్త మీనన్, సాక్షి వైద్య కూడా నటించబోతున్నారని సమాచారం. మరి దర్శకుడు అబ్బరాజు.. సామజవరగమన లాగా ఈ చిత్రాన్ని కూడా సరికొత్తగా తెరకెక్కించి హిట్ ను అందుకుంటాడేమో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button