తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Sundaram Master: ఇంట్రెస్టింగ్‌గా ‘సుందరం మాస్టర్’ ట్రైలర్

కమెడియన్ వైవా హర్ష మెయిన్ లీ‍‌‌డ్‌లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘సుందరం మాస్టర్’. ఈ సినిమాకు కళ్యాణ్ సంతోష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించగా..ఆర్టీ టీమ్ వర్స్ బ్యానర్‌పై మాస్ మహారాజా రవితేజ నిర్మిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్‌తో పాటు టీజ‌ర్ విడుద‌ల చేయ‌గా.. ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ ద‌క్కించుకుంది. తాజాగా, ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది.

ALSO READ: ‘సుందరం మాస్టర్’ మూవీ ట్రైలర్‌ను లాంఛ్ చేసిన మెగాస్టార్

గూడెంలో ఫన్‌, మిస్టరీ

హర్ష హీరో అనగానే సినిమా మొత్తం కామెడీగా ఉంటుందని అందరూ ఊహించారు. కానీ ట్రైలర్ చూస్తుంటే.. ఫన్‌తో పాటు ఏదో మిస్టరీ కూడా ఉన్నట్లు అర్థమవుతోంది. ఓ గూడెంలో ప్రజలకు ఇంగ్లీష్ పాఠాలు నేర్పించడానికి వెళ్లిన ఓ మాస్టర్‌కి ఎదురైన పరిస్థితులు, అక్కడ దాగి ఉన్న ఏదో రహస్యాన్ని కనిపెట్టేందుకు చేసిన ప్రయత్నం చుట్టూ ఈ కథ తిరుగుతోంది. అయితే ఈ ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి తన చేతుల మీదుగా లాంఛ్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button