తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

TSNAB: సాయిధరమ్‌ తేజ్‌ మూవీ టీంకు నోటీసులు… సినిమా టైటిల్ పై టీఎస్ న్యాబ్ అభ్యంతరం

సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న ‘గాంజా శంకర్‌’ సినిమా పేరుపై వివాదం నెలకొంది. గాంజా శంకర్‌ టైటిల్‌పై నార్కొటిక్‌ బ్యూరో ఆగ్రహం వ్యక్తంచేసింది. సినిమా పేరులో గంజా (గంజాయి) పదం తొలగించాలని సూచించింది. సినిమా పేరు మార్చాల్సిందేనంటూ చిత్ర యూనిట్‌కు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ( టీఎస్‌ న్యాబ్) పోలీసులు నోటీసులు జారీచేశారు.

Also Read: గీతామాధురికి పండంటి మగబిడ్డ.. అభిమానుల విషెస్

ఈ సినిమా అనౌన్స్ మెంట్ వీడియో గంజాయిని ప్రోత్సహించే విధంగా ఉందని నోటీసుల్లో పేర్కొన్నారు. సినిమాలో హీరో గంజాయి అమ్మే యువకుడిగా కనిపిస్తుండటం, అలాంటి సీన్స్ చూస్తే.. స్టూడెంట్స్, యూత్ వాటికి అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి .. వెంటనే సినిమా టైటిల్ మార్చాలని చిత్ర యూనిట్ కు సూచించారు. మూవీ టైటిల్ వీడియో కూడా యువతపై ప్రభావం చూపేలా ఉందని, దానిని కూడా మార్చాలని ఆదేశించారు.

Also Read:  ‘శ్రీ‌రంగ‌నీతులు’ మూవీ అప్డేట్.. ఫ‌స్ట్ సింగిల్ లిరికల్ వీడియో రిలీజ్

సినిమాలో మాదక ద్రవ్యాలకు సంబంధించిన అభ్యంతకరమైన దృశ్యాలుంటే ఎన్డీపీఎస్‌-1985 చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సినిమా ఆర్టిస్టులు, ఇతర సెలబ్రిటీలు సామాజిక బాధ్యతతో నడుచుకోవాలని నోటీసుల్లో తెలిపింది. సినిమాల్లో గంజాయి, డ్రగ్స్‌ని ప్రోత్సహించే సన్నివేశాలు ఉంటే తొలగించాలని తెలిపారు. సినిమాల్లో గంజాయి, డ్రగ్స్‌ని ఎట్టిపరిస్థితుల్లో చూపెట్టవద్దని ఆదేశించారు.

Also Read: శివకార్తికేయన్ నెక్ట్స్ మూవీ ‘అమరన్’… టీజర్ రిలీజ్

ఈ సినిమాను మాస్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే అధికారిక ప్రకటన వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారని సమాచారం. భీమ్స్ సిసిరీలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button