తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Elections: విశాఖకు కొత్త ఇమేజ్.. అన్ని రంగాల్లో అభివృద్ధే లక్ష్యం

విశాఖపట్నం.. పెట్టుబడులకు ప్రధాన కేంద్రం. 2019లో సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపై ప్రత్యేక దృష్టి సారించారు. నగరాభివృద్ధితో నగర రూపురేఖలు మార్చేలా అడుగులు వేశారు. నగరానికి కొత్త ఇమేజ్‌ తీసుకురావడంతోపాటు ప్రపంచ పటంలో విశాఖని ఎలా నిలబెట్టాలనే సంకల్పంతో ‘విజన్‌’ విశాఖ కాన్సెప్ట్‌తో సీఎం సన్నద్ధమయ్యారు. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో ఒక అరుదైన కార్యక్రమం ఏర్పాటు చేస్తోంది.

ALSO READ:  5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఇదే! కనిపించడం లేదా?

2 వేల మంది పారిశ్రామికవేత్తలు

విశాఖలో పరిశ్రమలు స్థాపనకు గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌తో ప్రమోట్‌ చేశారు. దీంతో విదేశాల నుంచి పారిశ్రామిక వేత్తలు క్యూ కడుతున్నారు. ఈ మేరకు రాడిసన్‌ బ్లూలో నిర్వహిస్తున్న ‘విజన్‌..విశాఖ’ సదస్సులో సీఎం జగన్ పాల్గొని వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పరిశ్రమలు, పర్యాటకం, హాస్పిటల్స్‌, హోటల్స్‌, మౌలిక సదుపాయాలు తదితర రంగాలకు చెందిన సుమారు 2000 మందితో సీఎం చర్చించన్నారు. ఆ తర్వాత విశాఖను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా భవిష్యత్ ప్రణాళికలు వెల్లడించనున్నారు.

ALSO READ: ఒక ప్రకటనతో ప్రజల నాడిని మార్చేయవచ్చా.. మహా మాంత్రికుడా?

రూ.1,500 కోట్ల అభివృద్ధి పనులు

గ్రేటర్‌ విశాఖ పరిధిలో రూ.1,500 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం జగన్‌ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. రూ.98 కోట్లతో వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి చేసిన ఐటీఐలు, పాలిటెక్నిక్‌ కళాశాలలను సీఎం వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. సుమారు రూ.100 కోట్లతో ముడసర్లోవలో నిర్మించనున్న జీవీఎంసీ నూతన భవనానికి శంకుస్థాపన చేయడంతోపాటు రూ.10 కోట్లతో టెర్టెల్‌ బీచ్‌ ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.

33 Comments

  1. ఇప్పటివరకు లేని డెవలప్మెంట్ ఇప్పటినుంచి ఎలా వస్తుంది జగనన్న

  2. Super jagan sir.ఆంధ్ర ప్రదేశ్ చరిత్రను.thirigi rasaru.జై జగన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button