తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Elections: 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఇదే! కనిపించడం లేదా?

పరిశ్రమల నుంచి మొదలు పెడితే ఉద్యోగాల వరకు.. మునుపెన్నడూ లేనంత పురోగతి ఏపీలో కనిపిస్తోంది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నాలుగున్నర ఏళ్లల్లో సంక్షేమమే కాదు.. అభివృద్ధి సైతం నాలుగు పాదాలపై పరుగులు పెడుతోంది. గ్రామస్థాయిలో ప్రభుత్వ వ్యవస్థలకు కార్యాలయాల నిర్మాణాలు, వ్యవసాయ కమిటీ కార్యాలయాల నిర్మాణాలు, ప్రభుత్వ స్కూళ్లను కనీవినీ ఎరుగనిస్థాయిలో ప్రెవేటు స్కూళ్లను తలదన్నేలా అద్భుతంగా తీర్చిదిద్దారు. కానీ అభివృద్ధి జరగలేదని టీడీపీ రాసి ఇచ్చిన స్క్రిప్ట్‌నే ప్రశాంత్ కిషోర్ చదువుతున్నారంటూ మంత్రి జోగి రమేష్‌ అన్నారు.

ALSO READ: చంద్రబాబు పైరవీలు ఫెయిల్.. బీజేపీతో పొత్తు లేనట్లేనా?

బాబుకు కనిపించడం లేదా?

రాష్ట్రంలో 17 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. దీంతోపాటు 10 ఫిషింగ్ హార్బర్లు, 4 పోర్టులు, 2 ఎయిర్‌‌పోర్టులు, 15,000 సచివాలయాలు, 10 వేల రైతు భరోసా కేంద్రాలు, 10 వేల విలేజ్ క్లినిక్‌లు, 542 అర్బన్ హెల్త్ సెంటర్స్, 1,126 పీహెచ్‌సీల ఏర్పాటు, 31 లక్షల ఇళ్ల పట్టాలు, 22 లక్షల పక్కా ఇళ్లు, 16 వేల కోట్లతో సర్కార్ బడుల రూపురేఖలు మార్చారు. అదే విధంగా 17,230 కి.మీ రహదారుల నిర్మాణంతోపాటు ఇంటి వద్దే సేవల కోసం 2.65 లక్షల మంది వాలంటీర్లను నియామకం చేపట్టారు. ఇవన్నీ బాబుకు కనిపించడం లేదా? అంతకుముందు 5 ఏళ్లలో అధికారంలో ఉన్న బాబు ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నిస్తున్నారు. మళ్లీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్‌తో వ్యాఖ్యలు చేయించడం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కొత్త నాటకానికి తెర తీసినట్లు తెలుస్తోంది.

ALSO READ: ఒక ప్రకటనతో ప్రజల నాడిని మార్చేయవచ్చా.. మహా మాంత్రికుడా?

ప్రశాంత్ కిషోర్‌ని ఎవరూ పట్టించుకోరు

ఏపీ రాజకీయాలపై ప్రశాంత్‌ కిషోర్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి జోగి రమేష్‌ మాట్లాడుతూ.. ప్రశాంత్ కిషోర్ పెట్టిన పార్టీ ఏమైంది?. ప్రశాంత్ కిషోర్ ని ఎవరూ పట్టించుకోరు. చంద్రబాబు ఆడిస్తున్న డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఎంతంది పీకేలు వచ్చినా, చంద్రబాబు వచ్చినా జగన్ గెలుపును ఆపలేరని.. జగనన్న పాలనను ఆశీర్వదించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button