తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

CM Jagan: నేడు విశాఖకు సీఎం జగన్.. షెడ్యూల్ ఇదే!

విశాఖను పరిపాలన రాజధానిగా మార్చాలని భావిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా ఒక్కో అడుగు ముందుకేస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు విశాఖలో జరగనున్న ‘విజన్ విశాఖ’ సదస్సుకి ఆయన హాజరుకానున్నారు. ఇందులో వివిధ రంగాల వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీ కానున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి విశాఖ వెళ్తారు. రాడిసన్‌ బ్లూలో జరిగే విజన్‌ విశాఖ సదస్సులో పాల్గొంటారు. ఆ సందర్భంగా రకరకాల రంగాల పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. ఈ కార్యక్రమంలో దాదాపు 2వేల మంది పారిశ్రామిక వేత్తలు పాల్గొంటారు. ఇదివరకు విశాఖలో జరిగిన ఇన్వెస్టర్స్‌ సదస్సులో జరిగిన ఒప్పందాలతో వచ్చిన పెట్టుబడులపై ఇందులో సీఎం జగన్ మాట్లాడతారు.

ALSO READ: 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఇదే! కనిపించడం లేదా?

మధ్యాహ్నం 12.35కి అక్కడి నుంచి బయలుదేరి పీఎం పాలెం (పోతిన మల్లయ్య పాలెం)లోని వైజాగ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌కి వెళ్తారు. కన్వెషన్ సెంటర్‌లో స్కిల్‌ డెవలప్‌మెంట్, ఉపాధి, సీడాప్‌ ద్వారా ఉపాధి పొందిన యువతతో సమావేశమవుతారు. ఆ సందర్భంగా పారిశ్రామిక అవసరాలకు తగినట్లుగా రాష్ట్ర యువతకు నైపుణ్య శిక్షణ (స్కిల్ డెవలప్‌మెంట్) ఇచ్చేందుకు రూపొందించిన భవిత అనే కొత్త కార్యక్రమాన్ని సీఎం జగన్‌ ప్రారంభిస్తారు.

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button