తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Elections: ఒక ప్రకటనతో ప్రజల నాడిని మార్చేయవచ్చా.. మహా మాంత్రికుడా?

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు- 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్(పీకే) ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి చివరకు సొంత రాష్ట్రం బీహార్‌లో రాజకీయ భిక్షగాడిగా మారాడని వైపీసీ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. ఆ రాష్ట్రంలో ప్రశాంత్‌ కిశోర్‌ పార్టీ దిక్కుమొక్కూ లేకుండా చిత్తుగా ఓడిపోనుంది. అదే తరహాలో ఏపీలోనూ చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ఓటమికి సిద్ధంగా ఉన్నారు. అయితే రానున్న ఎన్నికల్లో డీబీటీకి ప్రజలు ఓట్లు వేయరని ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో దుమారం లేపుతున్నాయి. అసలే సర్వే టీమ్‌లు కూడా సరిగ్గా లేని పీకే.. ఒక ప్రకటనతో మొత్తం ప్రజల నాడిని మార్చేయవచ్చని, తాను మహా మాంత్రికుడినని అనుకోవడమే తప్పా పెద్దగా ఓరిగేదేమి లేదని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

ALSO READ: చంద్రబాబు పైరవీలు ఫెయిల్.. బీజేపీతో పొత్తు లేనట్లేనా?

మేనిఫెస్టోపై ఉచిత సలహాలు..

అప్పట్లో లగడపాటి కూడా ఇలాగే అంచనాలు వేసి సన్యాసం తీసుకున్నాడని, ఇప్పుడు ప్రశాంత్ కిశోర్ వంతు కానుందని విమర్శలు చేస్తున్నారు. ప్రశాంత్ కిశోర్ సర్వేలు ఏపీకి సంబంధించి నిజం కావని, ఈసారి అంచనాలు తప్పుతాయని పలువురు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు, పవన్‌­కళ్యాణ్‌ చిత్తుగా ఓడిపోవడం ఖాయమని సామా­న్యులు సైతం చెబుతున్నారు. ఒకవేళ చంద్రబాబే గెలుస్తాడనుకుంటే మేనిఫెస్టోలో సంక్షేమంపై ఉచిత హామీలు ఇవ్వాలని చంద్రబాబుకు ప్రశాంత్‌ కిశోర్‌ ఎందుకు సలహా ఇవ్వడం గమనార్హం.

ALSO READ: ప్రధాని మోదీతో కలిసి ముందుకెళ్తాం.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబును కలవడం నిజం కాదా?

ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి ప్రశాంత్‌ కిశోర్‌ వెళ్లిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పలు సర్వేల్లో వెల్లడైన రిపోర్టు ఆధారంగా టీడీపీ ఓటమి ఖాయమని భావించి.. రానున్న ఎన్నికల్లో టీడీపీ వ్యూహ రచనలో సాయం చేయలేనని వెళ్లిపోయారు. తాజాగా, డీబీటీ, అభివృద్ధి రెండూ చేయని చంద్రబాబుకు ప్రజలు ఓటు వేస్తారని ప్రశాంత్‌ కిశోర్‌ చెప్పడానికి కారణం.. ఇటీవల చంద్రబాబు ఇంట్లో జరిగిన సమావేశమే కదా? అని ప్రశ్నించారు. అయితే బీహార్‌లో ప్రశాంత్ కిశోర్ సొంతంగా పార్టీ పెట్టుకున్నాడని, ఇంట గెలవని వాడి మాటలను ఏపీ ప్రజలు ఎలా నమ్ముతారని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button