తెలుగు
te తెలుగు en English
మరిన్ని

Maryanne Trump: తీర‌ని విషాదంలో డొన‌ల్డ్ ట్రంప్..

మ‌రోసారి అమెరికా (United States of America-USA) అధ్య‌క్ష ప‌ద‌విపై క‌న్నేసిన డొన‌ల్డ్ ట్రంప్ ఈ మేర‌కు ఎన్నిక‌ల‌కు స‌ర్వం సిద్ధం చేసుకుంటున్నాడు. ఇలాంటి స‌మ‌యంలో అత‌డు తీవ్ర విషాదంలో మునిగాడు. గ‌తేడాది సోద‌రుడు (Brother) మృతి చెంద‌గా సోమ‌వారం అత‌డి సోద‌రి (Elder Sister) మ‌రియ‌న్ ట్రంప్ బారీ (Maryanne Trump Barry) క‌న్నుమూసింది. సోద‌రి మృతి వార్త తెలుసుకుని ట్రంప్ దిగ్భ్రాంతి చెందాడు.

Also Read దేవుడా నీవే దిక్కు.. పెళ్లి కాని అబ్బాయిల మ‌హా పాద‌యాత్ర‌

ట్రంప్ కుటుంబం చాలా పెద్ద‌ది. డొన‌ల్డ్ ట్రంప్ (Donald Trump)న‌కు 4 తోబుట్టువులు ఉండ‌గా.. వారిలో మూడో సోద‌రి మేరియ‌న్ ట్రంప్ బారీ (86). న్యూయార్క్ లోని ఓ అపార్ట్ మెంట్ లో నివ‌సిస్తున్న మేరియ‌న్ (Maryanne Trump Barry) ఈనెల 13 తేదీ తెల్ల‌వారుజామున క‌న్నుమూసింది. ఆమె న్యూజెర్సీలో (New Jersey) ఫెడ‌ర‌ల్ న్యాయ‌మూర్తిగా ప‌నిచేశారు. 2019లో ప‌ద‌వీ విర‌మ‌ణ పొంది ఇంట్లోనే ఉంటున్నారు. మేరియ‌న్ రెండు వివాహాలు చేసుకుంది. డేవిడ్ డెస్మాండ్ ను మొద‌టి వివాహం చేసుకోగా.. వీరిద్ద‌రికీ ఒక కుమారుడు క‌లిగాడు. అనంత‌రం జాన్ జోసెఫ్ బారీని వివాహం చేసుకోగా అత‌డు 2000 సంవ‌త్స‌రంలో మ‌ర‌ణించాడు.

Also Read భార్య పుట్టిన‌రోజు మ‌రిచిపోయారా..? అయితే జైలుకే..

కాగా, ట్రంప్ కుటుంబంలో వ‌రుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. గ‌తేడాది ట్రంప్ సోద‌రుడు రాబ‌ర్ట్ ట్రంప్ (Robert Trump) గుండెపోటుతో మృతిచెందాడు. డొన‌ల్డ్ ట్రంప్ విష‌యానికొస్తే అత‌డిపై చాలా ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. మ‌రోసారి అధ్య‌క్షుడిగా (President) పోటీ చేయాల‌ని భావిస్తున్నాడు. కాక‌పోతే సొంత పార్టీ నాయ‌కులే ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా ప‌ని చేస్తున్నారు. దీంతో అత‌డి పోటీ అనేది సందిగ్ధంలో ప‌డింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button