తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Samoa: భార్య పుట్టిన‌రోజు మ‌రిచిపోయారా..? అయితే జైలుకే..

కుటుంబ‌స‌భ్యుల‌కు సంబంధించిన ముఖ్య‌మైన‌, ప్ర‌త్యేక రోజుల‌ను మ‌ర‌చిపోవ‌డం స‌హ‌జం. అవి మ‌ర‌చిపోయినా పెద్ద‌గా స‌మ‌స్య ఉండ‌దు. కానీ, భార్య‌కు (Wife) సంబంధించినవి మ‌ర‌చిపోతే మాత్రం అదో బాధ‌. అవి కొన్నిసార్లు సంసారంలో చిచ్చు పెట్ట‌వ‌చ్చు. అలాంటి స‌మ‌స్యతో ఎంత బాధ‌ప‌డిందో కానీ ఓ దేశం భార్య పుట్టిన‌రోజును (Birth Day) మ‌ర‌చిన వారికి శిక్ష‌లు (Punishment) అమ‌లు చేస్తోంది. ఆ దేశం ఏమిటో? ఎలాంటి శిక్ష‌లు అమ‌లు చేస్తున్నారో తెలుసుకోండి.

Also Read ఇంట‌ర్ 3 కాలేజీల్లో చ‌దివారా? మ‌ల్లారెడ్డి నామినేష‌న్ త‌ప్పుల‌త‌డ‌క

స‌మోవా (Samoa) అనే దేశం ఒక‌టి ఉంది. చాలా చిన్న దేశం కానీ మంచి ప‌ర్యాట‌క ప్ర‌దేశాలు ఉన్నాయి. ఆ దేశంలో భార్య పుట్టినరోజు మ‌రిస్తే చ‌ట్ట ప్ర‌కారం శిక్షార్హుల‌వుతారు. మొద‌టిసారి భార్య పుట్టిన‌రోజు మ‌రిస్తే హెచ్చ‌రించి వ‌దిలేస్తారు. అదే రెండోసారి గ‌నుక మ‌ర‌చిపోతే మాత్రం ఐదేండ్ల జైలు శిక్ష‌ (Prison).. లేదంటే భారీ జ‌రిమానా విధిస్తారు. భార్య‌ల పుట్టిన‌రోజు మ‌ర‌చిపోయే భ‌ర్త‌ల‌ను గుర్తించేందుకు స‌మోవా (Samoa) దేశంలో ప్ర‌త్యేక పోలీస్ (Special Force) బృంద‌మే ఉంది. అయితే ఇలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డం వెనుక మంచి ఉద్దేశ‌మే ఉంది.

ఇంట్లో ఉండి కుటుంబాన్ని (Family) మొత్తం చూసుకునే పాత్ర‌లో భార్య ఉంటుంది. అలాంటి ఆమెకు సంబంధించిన ముఖ్య‌మైన రోజును మ‌ర‌చిపోతే ఆమెకు ఇచ్చిన విలువ (Value) ఏమిట‌ని అక్క‌డి ప్ర‌భుత్వం భావిస్తోంది. మ‌హిళ‌ల‌కు స‌మ ప్రాధాన్యం ఇవ్వాల‌ని.. ఇంట్లో ఉండే మ‌హిళ‌లకు కూడా గౌర‌వం క‌ల్పించాల‌ని స‌దుద్దేశంతో ఈ చ‌ట్టాలు అమ‌లు చేస్తున్నారు. ఈ చ‌ట్టం అమ‌లుతో సమోవా దేశంలో భ‌ర్త‌లు (Husband) త‌మ భార్య‌ల పుట్టిన‌రోజులు మ‌రువ‌డం లేదు. ప్ర‌భుత్వం శిక్షిస్తుంద‌నే భ‌యం ఉన్నా లేకపోయినా భార్య‌ల‌పై ఉన్న ప్రేమ‌తో (Love) పుట్టిన‌రోజు వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button