తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

BRS Party: మార్చి 17 కాంగ్రెస్‌కు ఆఖరి గడువు… హరీష్ రావు హెచ్చరిక

కాంగ్రెస్ పార్టీ ఐదేళ్లు అధికారంలో కొనసాగి.. మరోసారి అధికారంలో రాదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ జోస్యం చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి బీఆర్ఎస్‌కు ఓ స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని భవిష్యత్ లేదని కార్యకర్తలు కుంగిపోవద్దని.. ఫ్యూచర్‌లో మళ్లీ అధికారంలోకి వచ్చేది తామేనని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. తెలంగాణ భవన్‌లో మల్కాజిగిరి పార్లమెంట్ సన్నాహక సమావేశం నిర్వహించారు. గత ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ నుండి రేవంత్ రెడ్డి తక్కువ ఓట్లతో ఎంపీగా గెలిచాడని గుర్తు చేశారు.

Also Read: ఆన్‌లైన్ లో రేషన్ కార్డులు ఇచ్చాం… కానీ ఎవరికి తెలియదు: కేటీఆర్

ఆరు గ్యారెంటీల అమలుకు మార్చి 17తో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన 100 రోజులు డెడ్ లైన్ పూర్తి అవుతోందని.. అప్పటిలోగా పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుందన్నారు. ఎలక్షన్ కోడ్ పేరుతో కాంగ్రెస్ హామీల అమలును వాయిదా వేసే అవకాశం ఉందని హరీష్ రావు అనుమానం వ్యక్తం చేశారు. అందుకే ఎలక్షన్ కోడ్ వచ్చేలోపే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే బీఆర్ఎస్ ప్రజా పోరాటం చేస్తోందని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button