తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Lok Sabha Elections: నేడు ఎన్నికల షెడ్యూల్ విడుదల

సార్వత్రిక ఎన్నికలతో పాటు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌ ప్లీనరీ హాల్‌లో జరిగే విలేకర్ల సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ మిగిలిన ఇద్దరు కమిషనర్లు జ్ఞానేశ్‌కుమార్‌, సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధులతో కలిసి 18వ లోక్‌సభతోపాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించనున్నారు.

ALSO READ: అన్ని వర్గాలకు అవకాశాలు.. ఇవాళే అభ్యర్థుల తుది ప్రకటన

ఎన్నికల నిర్వహణ కోసం ఇప్పటికే దేశంలోని ఆయా రాష్ట్రాల్లో ఈసీ అధికారులు పర్యటించారు. ఎలక్షన్లకు సంబంధించిన కసరత్తు పూర్తిచేశారు. ఈ నెల 13వ తేదీనే షెడ్యూల్ రిలీజ్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం భావించింది. అయితే, పోయిన నెల ఫిబ్రవరి 14న ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండే పదవీ విరమణ పొందారు. ఆ తర్వాత మార్చి 8న అనూహ్యంగా మరో కమిషనర్ అరుణ్ గోయెల్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఎన్నికల కమిషనర్ పదవులు ఖాళీ అయ్యాయి. ఫలితంగా షెడ్యూల్ విడుదల ఆలస్యమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button