తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Medaram Jathara: మేడారం వెళ్ళిన సీఎం రేవంత్… మొక్కులు చెల్లింపు

సమ్మక్క, సారక్క జాతర సందర్భంగా సీఎం రేవంత్‌రె‌డ్డి బేగంపేట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మేడారం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు జాతర నిర్వాహాకులు, మంత్రి సీతక్క ఘన స్వాగతం పలికారు. అనంతరం మేడారంలో సమ్మక్క, సారలమ్మలను సీఎం రేవంత్‌రెడ్డి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

Also Read: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం… పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు

ములుగు జిల్లా, మంత్రి సీతక్కతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు. తన రాజకీయ ప్రస్థానంలో ముఖ్యమైన కార్యక్రమాలు అన్ని ములుగు నుంచే ప్రారంభించానని గుర్తు చేశారు. ‘హాత్ సే హాత్‘ జోడో యాత్రను కూడా ఇక్కడి నుంచే ప్రారంభించామని తెలిపారు. మేడారం జాతర ఏర్పాట్లకు ప్రభుత్వం నుంచి రూ.110 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. పాలకులు ప్రజలను పీడించినప్పుడే ఎవరో ఒకరు వారికి ఎదురొడ్డి నిలబడతారని అన్నారు.

Also Read: కరెంట్ కట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం… అధికారులకు సీఎం హెచ్చరిక

ఆసియాలో అతిపెద్ద గిరిజన పండుగ.. తెలంగాణ కుంభమేళాగా ఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతరకు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. నిన్న మేడారంలో కీలక ఘట్టం ప్రారంభమైంది. సమ్మక్క తల్లి గద్దెపై కొలువు దీరింది. సమ్మక్కను ప్రధాని పూజారి ప్రతిష్టించారు. చిలకలగుట్టనుంచి సమ్మక్క తల్లి మేడారం గద్దెపైకి చేరడంతో మహాజాతర పరిపూర్ణత సంతరించుకుంది. ఇప్పటికే సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి చేరడంతో భక్తుల మొక్కులు జోరందుకున్నాయి. చిలకలగుట్టనుంచి పూజారులు, వడ్డెలు సమ్మక్కను భక్తుల జయజయధ్వానాల నడుమ తీసుకొచ్చి గద్దైపె ప్రతిష్ఠించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button