తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

MLA KTR: ఆటోలో ప్రయాణించిన కేటీఆర్… వీడియో వైరల్

భారీ కాన్వాయ్, ఫుల్ సెక్యూరిటీ నడుమ ఉండే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సాధారణ వ్యక్తిలా ఆటోలో ప్రయాణించారు. కాగా, పార్లమెంట్ సన్నాహక సమావేశాలు ముగించిన బీఆర్ఎస్.. తాజాగా అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని యూసఫ్ గూడ‌లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహించారు.

Also Read: రేషన్ కార్డుదారులకు ముఖ్య గమనిక.. ఈ- కేవైసీకి సమీపిస్తున్న గడువు

ఈ సమావేశానికి హాజరైన కేటీఆర్ పార్టీ నేతలతో వివిధ అంశాలపై చర్చించారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం కేటీఆర్ తన కారులో వెళ్లకుండా ఆటోలో ప్రయాణించారు. యూసఫ్‌గూడ నుండి తెలంగాణ భవన్ వరకు కేటీఆర్ ఆటోలో వెళ్లారు. కేటీఆర్ వెంట ఆటోలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కూడా ఉన్నారు. కేటీఆర్, ఎమ్మెల్యే మాగంటి ఆటోలో ప్రయాణించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button