తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Tamilisai: నాపై పువ్వులు వేసే వాళ్లు ఉన్నారు…రాళ్లు వేసే వాళ్లు ఉన్నారు: గవర్నర్

ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉణ్న మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేయడంతో చట్టరూపం సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ గవర్నర్ తమిళిసై ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. తను రాజకీయలపై ఆసక్తితోనే వైద్య వృతిని విడిచి బీజేపీలో చేరనని తెలిపారు. తను నమ్మిన సిద్ధాంతాలను అనుగుణంగా పనిచేస్తూ ఇప్పుడు గవర్నర్ గా ఎదిగానని తెలిపారు. రాజకీయాలల్లో ఎక్కువగా పురుషాధిక్యత ఉంటుందన్నారు.

ఈ నేపథ్యంలోనే గవర్నర్ తమిళ్ సై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై పువ్వులు వేసే వారు ఉన్నారని అలాగే రాళ్లు వేసే వారు కూడా ఉన్నారని తెలిపారు. తన పై రాళ్లు వేస్తే వాటితో భవంతి కట్టుకుట్టనని తెలిపారు. తన పై పిన్స్ వేస్తే…అవి గుచ్చుకొని రక్తం వస్తే దానితో తన చరిత్ర రాసుకుంటానన్నారు. అందరూ అందరికి నచ్చలని రూల్ లేదని చెప్పారు. ఎలాంటి అవమానాలు పట్టించుకోకుండా ప్రజల కోసం పనిచేస్తానని గవర్నర్ వెల్లడించారు.

అయితే ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పడు చర్చనీయంగా మారాయి. గత కొంత కొలంగా అధికార పార్టీ వార్సెస్ గవర్నర్ అన్నట్లుగా రాష్ట్రంలో పరిస్థితి ఉంది. ఆర్టీసీ ఉద్యోగుల విలీనం విషయంలో ఆమెకు ఉన్న ప్రశ్నలను అధికారులను పలుమార్లు అడిగి తెలుసుకున్నారు.అలాగే గవర్నర్ కోటా కింద ఎమ్మెల్యీ అభ్యర్ధిత్వాలకు బీఆర్ఎస్ ఇద్దరి పేర్లను సూచించారు. వారిని కూడా గవర్నర్ రిజెక్టు చేసింది. అయితే ఆమె ఇప్పుడు మాట్లాడిన మాటలు ఎవరిని ఉద్దేశించి అన్నారనే టాక్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button