తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Revanth Reddy: సీఎంగా ఎన్నికైన రేవంత్ రెడ్డి ప్రత్యేకతలు ఇవే..

సీనియర్లతో తీవ్ర పోటీ ఎదుర్కొని చివరకు ముఖ్యమంత్రిగా ఎన్నికైన రేవంత్ రెడ్డి ఎన్నో ప్రత్యేకతలు సాధించాడు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో ముఖ్యమంత్రిగా ఎంపికవడం అంటే అది సర్వసాధారణమైన విషయం కాదు. అధిష్టానం ఆశీస్సులు.. ఎమ్మెల్యేల అందరి మద్దతు ఉన్నా కూడా ఒక్కోసారి సీఎం పదవి వరించడం కష్టమే. మరి అలాంటి పరిస్థితులన్నింటిని తట్టుకుని నిలబడి సీఎంగా రేవంత్ రెడ్డి ఎన్నికయ్యారు. ఎలాంటి పనులు చేసినా.. ఎలా ఈ స్థాయికి వచ్చినా కూడా ఆయన రాజకీయ నాయకుడిగా విజయవంతమై అత్యున్నత పదవిని అధిష్టించబోతున్నాడు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సాధించిన ఘనతలు.. ప్రత్యేకతలు తెలుసుకోండి.

Also Read వాలంటీర్ల వ్యవస్థపై మరో దాడి.. ‘పచ్చ బ్యాచ్’ పనికిమాలిన పని

రేవంత్ ప్రత్యేకతలు

  • పాలమూరు ప్రాంతం నుంచి రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎన్నిక. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరూ కాలేదు. కానీ హైదరాబాద్ రాష్ట్ర తొలి, చివరి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు పాలమూరు ప్రాంతం నుంచి సీఎం అయ్యారు. 70 ఏళ్ల తర్వాత మళ్లీ పాలమూరి వాసికి ఆ పదవి లభించింది.
  • కాంగ్రెస్ పార్టీలో చేరిన ఐదేండ్లకే ముఖ్యమంత్రిగా ఎంపికవడం రికార్డు.
  • జెడ్పీటీసీ నుంచి సీఎం స్థాయికి ఎదగడం.
  • ఓడిన కొడంగల్ లోనే గెలిచి సీఎంగా ఎన్నిక కావడం.
  • పార్టీలో సీనియర్లు తీవ్ర వ్యతిరేకత ఉన్నా అధిష్టానం ఆశీస్సులతో పార్టీలో రాణించిన నాయకుడు.
  • ఎన్నికల సమయంలో రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు.
  • మంత్రిగా పని చేసిన అనుభవం లేకుండానే నేరుగా ముఖ్యమంత్రిగా ఎన్నిక.
  • ఓటుకు నోటు కేసులో అరెస్టయి జైలు శిక్ష అనుభవించి ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం.
  • కేసీఆర్ మాదిరే రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ ప్రవేశం.
  • జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీగా ఎన్నికై.. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎన్నిక.
  • ఏబీవీపీ, టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్. ఇలా నాలుగు పార్టీలు మారిన రేవంత్ రెడ్డి.

    Also Read చెదిరిన కేసీఆర్ కల.. అది ఒక్కటీ చేసి ఉంటే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button