తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Vivek Venkataswamy: టిబీజేపీకి బిగ్ షాక్.. పార్టీకి సీనియర్, కీలక నేత గుడ్ బై

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి మరో షాక్ తగిలింది. సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి రాజీనామా చేశారు. భారమైన హృదయంతో నేను రాజీనామా చేస్తున్నాను. ఇంతకాలం పార్టీలో తనకు సపోర్ట్ చేసినందుకు కృతజ్ఞతలు అని చెబుతూ లేఖను బీజేపీ హైకమాండ్‌కు రాజీనామా పత్రాన్ని పంపారు.

అయితే వివేక్ వెంకటస్వామి బీజేపీని వీడుతారని.. కాంగ్రెస్‌లో చేరబోతున్నారనే వార్తలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. అంతా అనుకుంటున్నట్టే ఆయన బీజేపీకి రాజీనామా చేశారు. అయితే కొద్దిరోజుల క్రితమే టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వివేక్ వెంకటస్వామితో భేటీ అయ్యారు. వివేక్‌ని కాంగ్రెస్‌లోకి రావాలని ఆహ్వనించారు. అయితే వివేక్ వెంకటస్వామితో పాటు ఆయన కుమారుడు వంశీకి కూడా కాంగ్రెస్ టికెట్ ఇచ్చేందుకు రెడీ ఉందనే సంకేతాల నేపథ్యంలో ఆయన కమలానికి గుడ్ బై చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button