తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

ఏప్రిల్ 15: చరిత్రలో ఈరోజు

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావం

హిమాచల్ ప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవాన్ని నేడు జరుపుకుంటారు. 1948 లో 30 పర్వత రాజ్యాలను కలిపి ఒక పాలనా విభాగంగా హిమాచల్ ప్రదేశ్ ఏర్పాటు చేశారు. 1971 జనవరి 25న భారతదేశ 18వ రాష్ట్రంగా అవతరించింది. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా. రాష్ట్రానికి తూర్పున టిబెట్, ఉత్తరాన, వాయువ్యంలో జమ్మూ కాశ్మీరు, నైరుతిలో పంజాబ్, దక్షిణాన హర్యానా, ఉత్తరప్రదేశ్, ఆగ్నేయంలో ఉత్తరాఖండ్ రాష్ట్రాలు సరిహద్దులుగా ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ విస్తీర్ణం 55,658. కాంగ్రి, పహారీ, పంజాబీ, హిందీ, మండియాలీ ప్రధానంగా మాట్లాడే భాషలు. హిందూ, బౌద్ధ, సిక్కు రాష్ట్రంలో ప్రధాన మతాలు.

Also Read: జగన్ మీద దాడి.. దిగజారిన యెల్లో మీడియా!

ప్రపంచ కళా దినోత్సవం

ప్రపంచ కళా దినోత్సవాన్ని నేడు జరుపుకుంటారు. చిత్రకళలో సృజనాత్మకతపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కోసం ప్రపంచ ఆర్ట్ ఆసోసియేషన్ ఈ దినోత్సవాన్ని నిర్ణయించింది. 2012 లో తొలసారిగా ఈ ఉత్సవాలను నిర్వహించారు. ఇటలీకి చెందిన చిత్రకారుడు లియొనార్డో డావిన్సి గౌరవార్థం ఆయన పుట్టినరోజును వరల్డ్ ఆర్ట్ డే గా నిర్వహిస్తారు.

గురునానక్ జయంతి

సిక్కుమత స్థాపకుడు గురు నానక్ దేవ్ 1469లో పాకిస్తాన్ లోని నన్కానా సాహిబ్ లో జన్మించారు. ఇతను పది మంది సిక్కు గురువులలో మొదటి వారు. హిందూ, ఇస్లామిక్ మత గ్రంథాలు చదివాడు. ఈ రెండు మతాలకి భిన్నమైన సిక్కు మతాన్ని స్థాపించారు. సిక్కు మతం ఏకేశ్వరోపాసక మతం.

Also Read: పోల్ స్ట్రాటజీ గ్రూప్ సర్వే: మళ్లీ వైసీపీదే అధికారం!

సుదర్శన్ పట్నాయక్ పుట్టినరోజు

ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ 1977 ఒడిశాలోని పూరీ నగరంలో జన్మించారు. 7 సంవత్సరాల వయస్సు నుంచే సైకత శిల్పాలను చేయటం ప్రారంభించారు. అందరు శిల్పులకన్నా భిన్నంగా ఈయన సముద్రపు ఒడ్డున ఇసుకతో తన కళాత్మక ప్రతిభతో శిల్పాలుగా మార్చారు. సందర్శకుల ప్రశంసలతోపాటు రాష్ట్రపతి పురస్కారాన్ని కూడా అందుకున్నారు. అలాగే ప్రపంచ స్థాయి సైకత శిల్పాల ఛాంపియన్ షిప్ పోటీల్లో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించారు.

అబ్రహం లింకన్ మరణం

అమెరికా దేశ 16వ అధ్యక్షుడు అబ్రహం లింకన్ 1865 వాషింగ్టన్ డి.సి. లో మరణించారు. ఈయన 1809 ఫిబ్రవరి 12న కెంటకీలోని హార్డిన్ కౌంటీలో జన్మించారు. అమెరికాకు 16వ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. అమెరికా అంతర్యుద్ధ సమయంలో అత్యంత కార్యదక్షతతో పరిపాలన చేశారు. కానీ దురదృష్టవశాత్తూ అంతర్యుద్ధం ముగిసే సమయంలోనే లింకన్ హత్య చేయబడ్డారు.

Also Read: సీఎం జగన్‌పై దాడికి కారకులెవరు?

టైటానిక్ షిప్ మునక

వైట్ స్టార్ లైన్ అనే సంస్థ కోసం హార్లాండ్ అండ్ వోల్ఫ్ సంస్థ నిర్మించిన అతి పెద్ద ప్రయాణ నౌక టైటానిక్. 1912లో తొలిసారిగా ఇంగ్లాండులోని సౌథాంప్టన్ నుంచి అమెరికాలోని న్యూయార్క్ వరకూ వెళ్తోంది. కానీ దురదృష్టవశాత్తు ఏప్రిల్ 15న తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో మంచుకొండను ఢీకొని సముద్రంలో మునిగిపోయింది. ప్రమాదంలో 1517 మంది మరణించారు.

లియొనార్డో డా విన్సీ పుట్టినరోజు

ప్రముఖ శాస్త్రవేత్త, గణితజ్ఞుడు, ఇంజనీరు, చిత్రకారుడు, శిల్పకారుడు, అర్కిటెక్టు, వృక్ష శాస్త్రవేత్త, సంగీతకారుడు, రచయిత లియొనార్డో డా విన్సీ 1452 ఇటలీలోని ఫోరెన్స్ లో విన్సి లేదా వించిలో జన్మించారు. రినైజెన్స్ శైలిలో ఈయన చిత్రీకరించిన మోనాలీసా, ది లాస్ట్ సప్పర్ చిత్రపటాలు డా విన్సీకి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చాయి. 15 ఏళ్ల వయస్సు నుంచే లియొనార్డో కళలపై మొగ్గు చూపాడు. 1495లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన లాస్ట్ సప్పర్ చిత్రపటాన్ని మొదలుపెట్టి 1497లో పూర్తిచేశారు. 1503లో విశ్వవిఖ్యాతమైన మొనాలిసా పెయింటింగ్ మొదలుపెట్టాడు. ఈ చిత్రపటం పూర్తి కావడానికి 3 సంవత్సరాలు పట్టింది. ఈ పెయింటింగ్ ఫ్రాన్స్ లోని లౌవ్రె మ్యూజియంలో ఉంది.

మరిన్ని విశేషాలు

  • కృష్ణా జిల్లాలోని కొన్ని ప్రాంతాలు, గోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాలను విడదీసి 1925 లో పశ్చిమ గోదావరి జిల్లాను ఏర్పాటు చేశారు. మిగిలిన గోదావరి జిల్లా పేరును తూర్పు గోదావరి జిల్లాగా మార్చారు.
  • స్విస్ గణిత శాస్త్రవేత్త లియోన్ హార్డ్ ఆయిలర్ 1707 స్విట్జర్లాండ్ లోని బాసెల్ లో జన్మించారు. గణితంలో ఆయిలర్ సమీకరణాన్ని ఆవిష్కరించారు.
  • స్కాట్లాండ్ కు చెందిన క్రైస్తవ మిషనరీ అలెగ్జాండర్ డాఫ్ 1806 స్కాట్లాండ్ లో జన్మించారు. మొట్టమొదటి అంతర్జాతీయ మిషనరీగా భారతదేశం వచ్చారు. కలకత్తా యూనివర్శిటీ స్థాపనలో కీలకపాత్ర పోషించారు.
  • తెలంగాణకు చెందిన ముస్లిం సూఫీ, సాధువు, పండితుడు అల్హాజ్ హజ్రత్ కరీముల్లా షా 1913 లో మరణించారు. ఈయన సమాధి హైదరాబాద్ లోని బేగంబజార్ సమీపంలో ఉంది.
  • హైదరాబాద్ రాజ్యం ప్రధానమంత్రి, పెష్కరుగా పలు హోదాల్లో పని చేసిన రాజకీయవేత్త చందు లాల్ సదన్ 1845 హైదరాబాద్ లో మరణించారు.
  • స్వాతంత్ర్య సమరయోధుడు రాచాబత్తుని సూర్యనారాయణ 1961లో మరణించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button