తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం
Trending

ఏప్రిల్ 16: చరిత్రలో ఈరోజు

తెలుగు నాటకరంగ దినోత్సవం

తెలుగు నాటకరంగ దినోత్సవాన్ని నేడు జరుపుకుంటారు. ఆధునిక తెలుగు నాటకరంగంలో తొలి నాటకకర్త, తొలి దర్శకుడు, తొలి ప్రదర్శనకారుడైన కందుకూరి వీరేశలింగం పంతులు జన్మదినం సందర్భంగా 2007లో తెలుగు నాటకరంగ దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా నాటక ప్రదర్శనలు, సదస్సులు, సమావేశాలు నిర్వహిస్తారు. నాటకరంగంలో విశేష కృషి చేసిన కళాకారులకు సన్మానాలు, సత్కారాలు, పురస్కారాలు, బిరుదులు అందజేస్తారు.

కందుకూరి వీరేశలింగం పంతులు పుట్టినరోజు

సంఘ సంస్కర్త, బహుముఖ ప్రజ్ఞాశాలి కందుకూరి వీరేశలింగం 1848 రాజమండ్రిలో జన్మించారు. సాహిత్య రంగ వికాసానికి ఎనలేని కృషి చేశారు. స్త్రీవిద్యకై ఉద్యమించి, ప్రచారం చేశారు. బాలికల కోసం పాఠశాలను ప్రారంభించారు. అంటరానితనాన్ని నిర్మూలించేందుకు కృషి చేశారు. అలాగే బాల్యవివాహాల నిర్మూలనకు, వితంతు వివాహాలను ప్రోత్సహించారు. ఏపీలో బ్రహ్మసమాజాన్ని స్థాపించారు. 1905లో హితకారిణీ అనే సంస్థను ప్రారంభించి సేవ కార్యక్రమాలు చేస్తూ తన ఆస్తినంతా దానం చేశారు.

చార్లీ చాప్లిన్ పుట్టినరోజు

ప్రముఖ హాస్య నటుడు చార్లీ చాప్లిన్ 1889 ఇంగ్లాండ్ లో జన్మించారు. అమాయకునిలా తెర మీద కనిపించే చాప్లిన్, హాస్వోత్రేరక వ్యక్తిలా అనిపించే చార్లీ, నిజానికి చాలా అందగాడు. ఆయన గొప్ప రచయిత, గాయకుడు. యుద్ధాన్ని విమర్శించే శాంతి ప్రియుడు. మూడేళ్ల వయస్సులోనే మిమిక్రీలో ప్రావీణ్యం కనబరిచారు. ఐదేళ్ల వయస్సులోనే స్టేజిపై పాటలు పాడారు. మొదటిసారి From Rags To Riches అనే నాటకంలో ఆఫీస్ బాయ్ గా వేషం లభించింది. 1904 నాటికి మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. చాప్లిన్ మొదటి సినిమా 1914 ఫిబ్రవరి 2 విడుదలైంది.

కె.హెచ్. ఆరా పుట్టినరోజు

తెలంగాణకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కృష్ణాజీ హౌలాజీ ఆరా 1914 సికింద్రాబాద్ సమీపంలోని బొల్లారంలో జన్మించారు.బొంబాయిలో ప్రోగ్రెసివ్ ఆర్టిస్ట్స్ గ్రూప్ లో సభ్యుడిగా కొనసాగిన ఆరా, తరువాతి కాలంలో ఆర్టిస్ట్స్ సెంటర్ ను స్థాపించారు. 2017 ముంబైలో ప్రైవేట్ లీ ఆరా అనే ఎగ్జిబిషన్ లో ఖరూన్ థాపర్ అనే క్యూరేటర్, ఆరా గీసిన 22 గురించి విశ్లేషణ చేశారు. 1942లో తొలిసారిగా బాంబేలోని చేతనా రెస్టారెంట్ లో నిర్వహించిన మొదటి సోలో షో విజయవంతమైంది.

డి. యోగానంద్ పుట్టినరోజు

అలనాటి దర్శకుడు యోగానంద్ దాసరి 1922 గుంటూరు జిల్లా పొన్నూరులో జన్మించారు. అమ్మలక్కలు చిత్రంతో తొలిసారిగా దర్శకునిగా గుర్తింపు పొందారు. ఎన్టీఆర్ కి నటించిన సూపర్ హిట్ మూవీలో ఆలీబాబా 40 దొంగలు, బాగ్దాద్ గజదొంగ, శ్రీగౌరీ మహత్యం, కోడలు దిద్దిన కాపురం లాంటి సినిమాలకు దర్శకత్వం వహించారు.

ఎంఎస్ నారాయణ పుట్టినరోజు

టాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు, దర్శకుడు, రచయిత మైలవరపు సూర్యనారాయణ (ఎంఎస్ నారాయణ) 1947 పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రులో జన్మించారు. 17 తెలుగు చిత్ర పరిశ్రమలో పనిచేసి 700 పైగా సినిమాల్లో నటించారు. తొలిసారిగా 1995లో వచ్చిన పెదరాయుడు సినిమాతో వెండి తెరపై కనిపించారు. 1997 లో వచ్చిన మా నాన్నకి పెళ్లి చిత్రం ద్వారా నటుడిగా మంచి గుర్తింపును పొందారు. తన నట జీవితంలో నారాయణకు 5 నంది అవార్డులు, ఫిల్మ్ ఫేర్ అవార్డులు, గ్రోయెర్ పురస్కారాలు దక్కాయి. దాదాపు 200 పైగా చిత్రాల్లో తాగుబోతుగా నటించి మెప్పించారు.

లారా దత్తా పుట్టినరోజు

విశ్వసుందరి, సినీ నటి లారా దత్తా 1978 ఉత్తరప్రదేశ్ లో ఘజియాబాద్ లో జన్మించారు. భారతదేశం నుంచి విశ్వసుందరిగా ఎంపికైన రెండో యువతిగా లారా పేరుగాంచారు. 1995 లో గ్లాడ్ రాగ్స్ మెగా మోడల్ ఇండియా పోటీల్లో పాల్గొని విజయం సాధించారు. 1997 లో మిస్ ఇంటర్ కాంటినెంటల్ పోటీల్లో మొదటి స్థానంలో నిలిచారు. 2000 సంవత్సరంలో ఫెమినా మిస్ ఇండియాగా ఎంపికయ్యారు.

జెడి చక్రవర్తి పుట్టినరోజు

భారతీయ సినీ నటుడు, దర్శకుడు జెడి చక్రవర్తి 1972 రాజమండ్రిలో జన్మించారు. ఈయన అసలు పేరు నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి. 1989లో రామ్ గోపాల్ వర్మ తీసిన శివ సినిమాతో తొలిసారిగా రంగప్రవేశం చేశారు. 1998 లో తెలుగు, హిందీలో విడుదలైన సత్య మూవీ ద్వారా మంచి పేరు సంపాదించుకున్నారు. నటుడిగా, ప్రతి నాయకుడిగా, దర్శకుడిగా చాలా చిత్రాలు చేశారు.

బళ్ళారి రాఘవ మరణం

నాటక రంగ ప్రముఖులు, న్యాయవాది బళ్ళారి రాఘవ 1946 లో మరణించారు. ఈయన 1880 ఆగష్టు 2న అనంతపురం జిల్లా తాడిపత్రిలో జన్మించారు. నాటకరంగంపై ఆసక్తితో రాణించారు. దేశ, విదేశాల్లో ప్రదర్శనలిచ్చారు. 1919 లో చేసిన ప్రదర్శనక రవీంద్ర నాథ్ ఠాగూర్ ఎంతగానో మెచ్చుకున్నారు.

మరిన్ని విశేషాలు

కేరళలోని తిరువాన్కూరు మహారాజు, రచయిత స్వాతి తిరునాళ్ 1813 ట్రావెన్ కోర్ సంస్థానం తిరువాన్కూరులో జన్మించారు.

సాహిత్య, కళా విమర్శకుడు, సామాజిక పండితుడు ఎన్ఎన్ కృష్ణమూర్తి 1910 ప్రకాశం జిల్లా అద్దంకిలో జన్మించారు.

మెక్సికన్- అమెరికన్ గాయని, గీత రచయిత్రి, డ్యాన్సర్ సెలీనా 1971 అమెరికా టెక్సాస్ లోని లేక్ జాక్సన్ లో జన్మించారు.

భారతీయ నటి, మోడల్ ప్రియాబెనర్జీ 1990 కెనడా అల్బెర్టాలోని కాల్గరీలో జన్మించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button