తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

ఏప్రిల్ 22: చరిత్రలో ఈరోజు

ప్రపంచ ధరిత్రి దినోత్సవం

ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని నేడు నిర్వహిస్తారు. పర్యావరణ పరిరక్షణ, భూమితాపం వంటి వాటిని తగ్గించేందుకు ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ రోజు ముఖ్య ఉద్దేశం. కాగా మొదటిసారి ధరిత్రి దినోత్సవాన్ని 1970 లో జరుపుకున్నారు. అయితే 1969 మార్చిలో ఐక్యరాజ్యసమితి జాన్ మెక్కల్ తో కలిసి ప్రారంభించింది. ఈ సందర్భంగా భూమిని కాపాడేందుకు తమ వంతు కృషి చేస్తామని ప్రతి ఒక్కరితో ప్రమాణాలు చేయనున్నారు.

లెనిన్ పుట్టినరోజు

రష్యన్ విప్లవ నాయకుడు, కమ్యూనిస్ట్ రాజకీయ వేత్త లెనిన్ 1870 రష్యన్ సామ్రాజ్యంలోని సింబిర్క్స్ ప్రాంతంలో జన్మించారు. ఈయన పూర్తిపేరు వ్లాదిమిర్ ఇల్యీచ్ ఉల్యోనోవ్. 31 ఏళ్ల వయస్సులో లెనిన్ గా పేరు మార్చుకున్నారు. 1917లో జరిగిన అక్టోబర్ విప్లవానికి ఈయన నాయకుడు. రష్యన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ లేదా ‘బోల్షెవిస్ట్ రష్యా’ దేశానికి మొదటి అధినేత. కార్ల్ మార్క్స్ ప్రతిపాదించిన మార్క్సిజమ్ కు ఇతను కొన్ని మార్పులను చేసిన సిద్ధాంతాన్నే ‘లెనినిజమ్’ లేదా ‘మార్క్సిజమ్- లెనినిజమ్’ అని అంటారు.

దగ్గుబాటి పురంధేశ్వరి పుట్టినరోజు

భారతీయ రాజకీయ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత దగ్గుబాటి పురంధేశ్వరి 1959 తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. టీడీపీ వ్యవస్థాపకలు నందమూరి తారక రామారావు కుమార్తె. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2004లో బాపట్ల నుంచి ఎంపీగా తొలిసారి లోక్ సభకు ఎన్నికయ్యారు. ఆతర్వాత 2009లో విశాఖ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. యూపీఏ హయాంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కేబినెట్ లో కేంద్ర సహాయ మంత్రి సేవలందించారు. ఆతర్వాత 2014లో బీజేపీలో చేరారు. 2023 జులై 4న ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులయ్యారు.

జె. రాబర్ట్ ఒపెన్ హైమర్ పుట్టినరోజు

అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, అణుబాంబు సృష్టికర్త జె. రాబర్ట్ ఒపెన్ హైమర్ 1904 అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జన్మించారు. ప్రపంచ యుద్ధ సమయంలో మాన్ హటన్ ప్రాజెక్ట్ లోని లాస్ అలమోస్ లాబొరేటరీకి డైరెక్టర్ గా వ్యవహరించారు. నక్షత్రాల్లో న్యూట్రాన్, బ్లాక్ హోల్స్ సిద్ధాంతాన్ని, క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. 1943 లో మెదటిసారి అణ్వాయుధాలను అభివృద్ధిని పనిచేశారు. 1945లో జపాన్ కు వ్యతిరేకంగా హిరోషిమా, నాగసాకి ప్రాంతాల్లో అణుబాంబులు ఉపయోగించబడ్డాయి.

రిచర్డ్ నిక్సన్ మరణం

అమెరికా దేశ 37వ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ 1994 అమెరికాలోని న్యూయార్క్ లో మరణించారు. 1969-74 మధ్య అమెరికా అధ్యక్షుని సేవలందించారు. ఈయన 1913 జనవరి 9న అమెరికా కాలిఫోర్నియాలోని యోర్బా లిండా అనే ప్రాంతంలో జన్మించారు. కాలిఫోర్నియా సెనేటర్ గానూ, 1953-61 మధ్య అధ్యక్షుడు ఐసెన్ హోవర్ దగ్గర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఈయన పాలనలో సోవియట్ యూనియన్, చైనా దేశాలతో ఘర్షణ తగ్గింది. నాసా మొదటిసారి మానవ సహిత అంతరిక్ష నౌకను చంద్రుడి మీదకు పంపింది. వాటర్ గేట్ కుంభకోణం, అవినీతి ఆరోపణల కారణంగా రెండోసారి అధ్యక్షుడిగా మధ్యలోనే పాలన ఆగిపోయింది.

సర్ హెన్రీ రాయిస్ మరణం

రోల్స్ రాయిస్ కార్ల కంపెనీ వ్యవస్థాపకులు సర్ ఫ్రెడరిక్ హెన్రీ రాయిస్ 1933 ఇంగ్లాండ్ లోని సస్సెక్స్ వెస్ట్ విట్టరింగ్ ప్రాంతంలో మరణించారు. ఈయన 1863 ఇంగ్లాండ్ లోని హంటింగ్ డాన్ షైర్ అల్వాల్టన్ లో జన్మించారు. చార్లెస్ రోల్స్ తో కలిసి 1904 లో రోల్స్ రాయిల్స్ కార్ల ఉత్పత్తి సంస్థను ప్రారంభించారు.

మరిన్ని విశేషాలు

జర్మన్ భావవాద తత్వవేత్త ఇమ్మాన్యుయెల్ కాంట్ 1724 పర్షియా సామ్రాజ్యంలో జన్మించారు.

ప్రముఖ భారతీయ సంగీత గాత్ర కళాకారిణి అంజనీబాయి మాల్పెకర్ 1883 గోవాలోని మాల్పేలో జన్మించారు. 1899 తన 16 ఏళ్ల వయస్సులోనే ముంబైలో తొలిసారి కచేరి చేశారు.

హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మకాని నారాయణరావు 1936 నెల్లూరులో జన్మించారు. 1986లో ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు.

ప్రముఖ చిత్రకారుడు, సాహితీవేత్త శీలా వీర్రాజు 1939 రాజమండ్రిలో జన్మించారు. తెలుగులో ఆయన రాసిన నవల ‘మైనా’ విశేషమైన ప్రశంసలు అందుకుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button