తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

ఏప్రిల్ 23: చరిత్రలో ఈరోజు

ప్రపంచ పుస్తక దినోత్సవం

ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని నేడు నిర్వహిస్తారు. 1995 నుండి ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని జరుపుతున్నారు. పుస్తకాలను చదవడం, ప్రచురించడం, కాపీ రైట్స్ వంటి విషాయాలపై అవగాహన కల్పించనున్నారు. వాలెనియన్ రచయిత విసెంటే క్లావెల్ ఆండ్రెస్ పుస్తక దినోత్సవం జరపాలని అనుకున్నాడు. ప్రపంచ రచయిత మిగ్యుఎల్ డి సెర్వంటెస్ పుట్టినతేది, మరణించిన తేదీని గానీ పుస్తక దినోత్సవంగా చేసి ఆయనకు గౌరవాన్ని అందించాలనుకున్నాడు. విలియం షేక్స్పియర్, గార్సియాసా డి లా వేగా వంటి రచయితలు మరణించిన తేదీ, అనేక ఇతర రచయితల పుట్టిన, మరణించిన తేదీ ఏప్రిల్ 23 అవడం వల్ల 1995లో యునెస్కో ఏప్రిల్ 23ను ప్రపంచ పుస్తక దినోత్సవంగా ప్రకటించింది.

ప్రపంచ ఆంగ్ల భాషా దినోత్సవం

ప్రపంచ ఆంగ్ల భాషా దినోత్సవాన్ని నేడు జరుపుకుంటారు. 2010 ఐక్యరాజ్యసమతిలో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ డిపార్ట్ మెంట్ ద్వారా స్థాపించబడింది. ప్రపంచ ప్రఖ్యాత రచయిత విలియం షేక్స్పియర్ మరణించినరోజు సందర్భంగా ఈరోజును జరుపుకుంటారు. ప్రపంచంలో గుర్తింపు పొందిన ఆరు అధికార భాషల వినియోగాన్ని ప్రోత్సహించేందుకుగాను ఈ రోజును జరుపుతున్నారు.

ప్రపంచ స్పానిష్ భాషా దినోత్సవం

ప్రపంచ స్పానిష్ భాషా దినోత్సవాన్ని నేడు జరుపుకుంటారు. స్పానిష్ రైటర్ మిగ్యుఎల్ డి సెర్వంటెస్ మరణించినరోజు కారణంగా ఆయన జ్ఞాపకార్థం ఈరోజును జరుపుతున్నారు.

మాక్స్ ప్లాంక్ పుట్టినరోజు

ప్రసిద్ధి చెందిన జర్మన్ భౌతిక శాస్త్రవేత్త. నోబెల్ బహుమతి గ్రహీత మ్యాక్స్ ప్లాంక్ 1858 జర్మనీలోని కీల్ లో జన్మించారు. 17 ఏళ్లకే డిగ్రీ పూర్తి చేశారు. 1900 సంవత్సరంలో క్వాంటమ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినందుకు గాను 1918 లో నోబెల్ బహుమతి లభించింది. అల్బర్ట్ ఐన్ స్టీన్ ఫోటో విద్యుత్ ఫలిత వాదం, ప్లాంక్ క్వాంటమ్ సిద్ధాంతాన్ని బలపరిచింది.

ఎస్. జానకి పుట్టినరోజు

ప్రసిద్ధ నేపథ్య గాయని ఎస్. జానకి 1938 గుంటూరు జిల్లా రేపల్లె తాలుకా పల్లపట్ల గ్రామంలో జన్మించారు. ఈమె పూర్తి పేరు శిష్ట్ల శ్రీరామ మూర్తి జానకి. తన 50 సంవత్సరాల సినీ జీవితంలో 50,000 పైగా పాటలు పాడారు. ఎక్కువగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో పాడారు. మలయాళం, కన్నడ భాషలలోనే ఎక్కువగా పాడినట్టు ఆమె స్వయంగా ప్రకటించారు. ఉత్తమ గాయనిగా 4 సార్లు జాతీయ పురస్కారం, 31 సార్లు వివిధ రాష్ట్రాల నుంచి అవార్డులు అందుకున్నారు. 1957లో తమిళ చిత్రం విధియిన్ విలాయత్తులో తొలిసారిగా తన గాత్రాన్ని వినిపించారు. ఎమ్మెల్యే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.

మనోజ్ బాజ్ పాయ్ పుట్టినరోజు

భారతీయ నటుడు మనోజ్ బాజ్ పాయ్ 1969 బీహార్ లోని నర్కటిగంజ్ లో జన్మించారు. ముఖ్యంగా హిందీ సినిమాలలో నటించారు. తెలుగు సినిమాలు కూడా చేశారు. ఒకసారి జాతీయ ఉత్తమ నటుడిగా, రెండుసార్లు ఉత్తమ సహాయ నటుడిగా పురస్కారాలు అందుకున్నారు.

శ్వేతా మీనన్ పుట్టినరోజు

భారతీయ నటి, మోడల్, టెలివిజన్ యాంకర్ శ్వేతా మీనన్ 1974 ఛండీగర్ లో జన్మించారు. 1994 ఫెమినా మిస్ ఇండియా ఆసియా పసిఫిక్ టైటిల్ విజేతగా నిలిచారు. అలాగే మలయాళం, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించారు. ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ఆమె బిగ్ బాస్ మలయాళం సీజన్- 1 లో పాల్గొన్నారు.

విలియం షేక్ స్పియర్ మరణం

ప్రపంచ ప్రఖ్యాత ఆంగ్ల కవి, నాటక రచయిత, నటుడు విలియం షేక్ స్పియర్ 1616 ఇంగ్లాండ్ లోని వార్విక్ షైర్ స్ట్రాట్ ఫోర్డ్- అపాన్- అవాన్ అనే ప్రాంతంలో మరణించారు. ఈయనను ఇంగ్లాండు జాతీయ కవిగానూ, బార్డ్ ఆఫ్ అవాన్ గానూ పిలుస్తారు. ఈయన 1564 లో ఇంగ్లాండ్ లోని స్ట్రాట్ ఫోర్డ్ లో జన్మించారు. ప్రస్తుతం లభిస్తున్న రచనలు షెక్ స్పియర్ 1590, 1613 మధ్య రాసినవి. 16వ శతాబ్దంలోనే ఎక్కువగా రచనలు చేశారు.

సత్యజిత్ రాయ్ మరణం

భారత ప్రముఖ సినీ డైరెక్టర్, రచయిత, భారతరత్న సత్యజిత్ రాయ్ 1992 కలకత్తాలో మరణించారు. ప్రపంచ సినిమా చరిత్రలో 20వ శతాబ్దపు ఉత్తమ దర్శకుల్లో ఒకరిగా పేరు పొందిన సత్యజిత్ 1921 మే 2న కలకత్తాలో జన్మించారు. సినిమాలు, లఘు చిత్రాలు, డాక్యుమెంటరీలు కలుపుకుని మొత్తం 37 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన మొదటి సినిమా పథేర్ పాంచాలీ.. కేన్స్ చలనచిత్రోత్సవములో 11 అంతర్జాతీయ పురస్కారాలు గెలుచుకుంది. 1992లో ఆస్కార్ అవార్డును కూడా అందుకున్నారు. చలనచిత్ర రంగానికి తొలిసారిగా భారతరత్న అందుకున్న వ్యక్తిగా సత్యజిత్ రాయ్ రికార్డుకెక్కారు.

మరిన్ని విశేషాలు

అమెరికాలో మొదటి పబ్లిక్ స్కూల్ ను 1635 లో ప్రారంభించారు.

ఒడిశాలోని లక్ష్మీపూర్ ఎమ్మెల్యే జిన్నూ హిక్కాకను మావోయిస్టులు 2012లో అపహరించారు.

హిందీ నాటకకర్త, బహుభాషావేత్త నాదెళ్ళ పురుషోత్తమ కవి 1863 కృష్ణా జిల్లా నాదెళ్ల గ్రామం సీతారామపురం అగ్రహారంలో జన్మించారు.

ప్రముఖ రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి 1891 తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పొలమూరు గ్రామంలో జన్మించారు.

తెలుగు నాటక రచయిత, గాయకుడు కోగంటి గోపాలకృష్ణయ్య 1923 కృష్ణా జిల్లా బొమ్మలూరులో జన్మించారు.

ప్రముఖ పద్యకవి, రంగస్థల సినిమా నటుడు, గాయకుడు, అధ్యాపకుడు, వక్త అక్కిరాజు సుందర రామకృష్ణ 1949 గుంటూరు జిల్లా నరసరావుపేటలో జన్మించారు.

ఆయుర్వేద వైద్యులు, సాహితీవేత్త, పరిశోధకుడు డా. జి.వి. పూర్ణచందు 1957 కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు.

ప్రముఖ రంగస్థల నటి, దర్శకురాలు ఉషా గంగూలీ 2020 కలకత్తాలో మరణించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button