తెలుగు
te తెలుగు en English
క్రికెట్

Arjun Award: మహ్మద్ షమీకి అర్జున అవార్డు… రాష్ట్రపతి చేతుల మీదుగా స్వీకరణ

దేశంలో రెండవ అత్యున్నత క్రీడా పురస్కారం అర్జున అవార్డు దక్కడంపై టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. అవార్డు దక్కడాన్ని ఒక కలగా అభివర్ణించాడు. ఈ అవార్డు దక్కడం ఒక కల అని… జీవితకాలం మొత్తం గడిచిపోయినా చాలామందికి ఈ అవార్డు దక్కదని తెలిపారు. చాలా మంది క్రీడాకారులు ఈ అవార్డు అందుకోవాలని ఎదురుచూస్తారని… కానీ ప్రేక్షకులుగా మిగిలిపోతారని…. చాలా మందికి నెరవేరని కల ఇదని షమీ వ్యాఖ్యానించాడు.

Also Read: ఈషా సింగ్ కు పారిస్ ఒలింపిక్స్ బెర్తు ఖరార్… శుభాకాంక్షలు తెలిపిన కవిత

దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము చేతుల మీదుగా షమీ అర్జున అవార్డు స్వీకరించాడు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో క్రీడా అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి షమీ, ఇతర క్రీడాకారులు హాజరయ్యారు. షమీకి అర్జునుడి ప్రతిమ, ప్రశంసాపత్రం అందజేశారు. 33 ఏళ్ల షమీ ఇప్పటివరకు 64 టెస్టుల్లో 229 వికెట్లు… 101 వన్డేల్లో 195 వికెట్లు… 23 అంతర్జాతీయ టీ20ల్లో 24 వికెట్లు తీశాడు. దేశవాళీల్లో 88 మ్యాచ్ ల్లోనే 332 వికెట్లు సొంతం చేసుకున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button