తెలుగు
te తెలుగు en English
క్రికెట్

IPL 2024: ముంబై ఇండియ‌న్స్ సరికొత్త థీమ్… సూపర్ హీరోలుగా క్రికెటర్లు

ఐపీఎల్ జ‌ట్ల‌లో విజ‌య‌వంత‌మైన ముంబై ఇండియ‌న్స్ ఆరో టైటిల్ సాధించడానికి సిద్దం అయింది. కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా రాక‌తో మ‌రింత జోష్‌లో ఉన్న ముంబై.. 17వ‌ సీజ‌న్‌లో పంజా విసిరేందుకు సిద్ధ‌మైంది. అందుకు తగ్గ‌ట్టే ఆ ఫ్రాంచైజీ ఒక గ‌దిని సూప‌ర్ హీరో థీమ్‌తో స‌రికొత్త‌గా డిజైన్ చేసింది. స్టార్ ప్లేయ‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, పాండ్యా, జ‌స్ప్రీత్ బుమ్రా, ఇషాన్ కిష‌న్, గెరాల్డ్ కొయేట్జీల ఫొటోల‌ను సూప‌ర్ హీరో అవ‌తారంలో క‌నిపించారు. ఆ వీడియోను ముంబై ఫ్రాంచైజీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.

Also Read: క్రికెట్ లో కొత్త రూల్.. ప్లేయర్లకు కష్టమేనా?

ఐపీఎల్ 17వ సీజ‌న్ మినీ వేలం ముందు పాండ్యా తిరిగి సొంత గూటికి చేరాడు. ముంబై త‌ర‌ఫున 2015, 2017, 2019, 2020లో ట్రోఫీ గెలిచిన అత‌డిని 2021లో ముంబై వ‌దిలేసింది. దాంతో, గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఎంపికైన పాండ్యా ఆ జ‌ట్టును తొలి సీజ‌న్‌లోనే చాంపియ‌న్‌గా నిలిపాడు. 16వ సీజ‌న్‌లోనూ గుజ‌రాత్‌ను ఫైన‌ల్‌కు తీసుకెళ్లాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button