తెలుగు
te తెలుగు en English
మరిన్ని

FIH-2023: వరల్డ్‌ కప్‌ తొలి మ్యాచ్‌లో భారత్ ఉమెన్స్ హాకీ జట్టు ఘన విజయం

మహిళల జూనియర్‌ హాకీ వరల్డ్‌ కప్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో భారత్ శుభారంభం చేసింది. కెనెడాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 12-0 గోల్స్‌ తేడాతో ఆ జట్టును చిత్తుగా ఓడించింది. చిలీలోని శాంటియాగోలో జరుగుతున్న ఈ టోర్నీలో మ్యాచ్‌ ప్రారంభంలో అన్ను రెండు గోల్స్ కొట్టగా, తర్వాత రెండో క్వార్టర్ ముగిసే సమయానికి భారత జట్టు 4-0తో ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత భారత్‌ మరో 8 గోల్స్‌ కొట్టడంతో విజయం ఏకపక్షంగా వరించింది.

ALSO READ: చరిత్ర సృష్టించిన ఉగాండా.. తొలిసారి టీ20 క్రికెట్‌కు అర్హత

ముంతాజ్‌ ఖాన్‌ నాలుగు గోల్స్‌

కెనడాపై భారత్ 12-0 తేడాతో విజయం సాధించింది. భారత్‌ తరఫున ముంతాజ్‌ ఖాన్‌ ఏకంగా నాలుగు గోల్స్‌, అన్ను, దీపిక సోరెంగ్‌ చెరో మూడు గోల్స్‌ సాధించారు. దీపి మోనికా టోపో, నీలమ్‌ ఒక్కో గోల్‌ కొట్టారు. ఇందులో అన్నూ (4వ నిమిషం, 6వ, 39వ ని), డిపి మోనికా టోప్పో (21వ ని.), ముంతాజ్ ఖాన్ (26 వ నిమిషం, 41, 54, 60వ), దీపికా సోరెంగ్ (34వ నిమిషం, 50వ, 54వ), నీలం (45వ నిమిషంలో) గోల్స్ చేశారు. కాగా, భారత్ తర్వాతి మ్యాచ్‌లో శుక్రవారం జర్మనీతో తలపడనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button