తెలుగు
te తెలుగు en English
టెన్నిస్

Sumit Nagal: భారత టెన్నిస్ ఆటగాడు సుమిత్ నాగల్ కు అండగా నిలిచిన పెప్సీకో

అంతర్జాతీయంగా భారత టెన్నిస్ ఆటగాడు సుమిత్ నాగల్ సత్తా చాటుతున్నాడు. అయితే ఆయన తన ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉందని చెప్పడంపై తీవ్రస్థాయిలో స్పందన వచ్చింది. అగ్రశ్రేణి స్టార్లు తప్ప 100 కంటే ఎక్కువ ర్యాంక్‌ ఉన్న ఆటగాళ్ల స్థితి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో చెప్పేందుకు ఇది చక్కటి ఉదాహరణ! భారత్‌కు చెందిన ప్రపంచ 159వ ర్యాంకర్‌ సుమీత్‌ నగాల్‌ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నాడు.

తన బ్యాంక్‌ అకౌంట్‌లో సుమారు 80 వేలు మాత్రమే ఉన్నాయని అతను ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు ప్రైజ్‌మనీల ద్వారా వచ్చిన డబ్బు, ఐఓసీఎల్‌ కంపెనీ జీతం, మహా టెన్నిస్‌ ఫౌండేషన్‌ ఇచ్చే ఆర్థిక సహాయం మొత్తం టెన్నిస్‌లోనే పెడు తున్నానని, అయినా సరే పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉందని వెల్లడించాడు. డబ్బులు లేకపోవడంతో ఫిజియో కూడా లేకుండా ఒకే ఒక కోచ్‌తో తాను పోటీల్లో పాల్గొంటున్నానని అన్నాడు.

భారత డేవిస్ కప్ జట్టు సభ్యుడైన సుమిత్ నాగల్ తన దయనీయ పరిస్థితిని బయటపెట్టేసరికి, దాతలు పెద్ద ఎత్తున స్పందించారు. ఢిల్లీ టెన్నిస్ సంఘం 5 లక్షల సాయం ప్రకటించింది. బహుళజాతి శీతలపానీయాల సంస్థ పెప్సీకో ఇండియా మూడేళ్లపాటు సుమిత్ నాగల్ కు ఆర్థిక అండదండలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. తమ గెటోరేడ్ ఎనర్జీ డ్రింక్ ప్రచారకర్తగా అతడిని నియమించేందుకు ఆసక్తిగా ఉన్నట్టు పెప్సీకో ఎనర్జీ అండ్ హైడ్రేషన్ విభాగం అసోసియేట్ డైరెక్టర్ అంకిత్ అగర్వాల్ వెల్లడించారు.

దీనిపై నాగల్ స్పందిస్తూ, గెటోరేడ్ తో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నానని, తన పరిస్థితి పట్ల పెప్సీ కో స్పందించిన తీరు కదిలించివేసిందని తెలిపాడు. తన కెరీర్ కీలక దశలో ఈ భాగస్వామ్యం లభించిందని వివరించాడు. ఆట పట్ల తపన, కఠోర శ్రమ వల్తే తనకు ఈ గుర్తింపు లభించిందని నాగల్ పేర్కొన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button