తెలుగు
te తెలుగు en English
టెన్నిస్

Tennis: టెన్నిస్‌ స్టార్ హాలెప్‌పై నాలుగేళ్ల నిషేదం… ఆ తప్పిదామే కారణమా?

రెండుసార్లు గ్రాండ్‌స్లామ్‌ ఛాంపియన్‌, రొమేనియా స్టార్‌ సిమోనా హాలెప్ పై నాలుగేళ్ల నిషేధం పడింది. డోపింగ్‌ నిబంధనలను అతిక్రమించినందుకు… రొమేనియా టెన్నిస్‌ స్టార్, ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ సిమోనా హాలెప్‌పై ఇంటర్నేషనల్‌ టెన్నిస్‌ ఇంటెగ్రిటీ ఏజెన్సీ నిషేధం విధించింది. 31 ఏళ్ల హాలెప్‌ 2022 యూఎస్‌ ఓపెన్‌ సందర్భంగా డోపింగ్‌ పరీక్షలో విఫలమైంది. దాంతో ఆమెపై 2022 అక్టోబర్‌లో తాత్కాలిక నిషేధం విధించారు.

ఐటీఐఏ ప్యానెల్‌ విచారణలో హాలెప్‌ ఉద్దేశపూర్వకంగానే డోపింగ్‌ నియమావళిని ఉల్లంఘించిందని తేలింది. దాంతో ఆమెపై నిషేధాన్ని 2026 అక్టోబర్‌ 6 వరకు పొడిగించారు. 2017లో ప్రపంచ నంబర్‌వన్‌గా అవతరించిన హాలెప్‌ 2018లో ఫ్రెంచ్‌ ఓపెన్, 2019లో వింబుల్డన్‌ రెండు గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ సాధించింది.
హలెప్‌ రొక్సాడస్టాట్‌ అనే డ్రగ్‌ వాడినట్టు తేలింది. బ్లడ్‌ బూస్టర్‌గా పనిచేస్తూ ఎర్ర రక్త కణాలను అధికంగా ఉత్పత్తి చేయడంలో కీలకపాత్ర పోషించే రొక్సాడస్టాట్‌ను ప్రపంచ డోపింగ్‌ నిరోధక సంస్థ నిషేధిత డ్రగ్‌ జాబితాలో చేర్చింది. మరోవైపు ఐటీఐఏ విధించిన నిషేధాన్ని కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్‌లో సవాలు చేస్తానని హాలెప్‌ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button