తెలుగు
te తెలుగు en English
టెన్నిస్

US Open Women’s Tennis: 19 ఏళ్లకే టైటిల్ సాధించి రికార్డు సృష్టించిన కోకో గాఫ్

అమెరికా టీనేజి అమ్మాయి కోకో గాఫ్ యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్ కైవసం చేసుకుంది.యూఎస్ ఓపెన్ ఫైనల్‍లో బెలారస్‍కు చెందిన ప్ర‌పంచ రెండో సీడ్ అరీనా సబలెంకాను ఓడించి 19 ఏళ్లకే ఈ టైటిల్‍ను కైవసం చేసుకుంది. మహిళల సింగిల్స్ ఫైనల్లో ఆరో సీడ్ కోకో గాఫ్ 2-6, 6-3, 6-2తో తనకంటే మెరుగైన సీడెడ్ ప్లేయర్ అరియానా సబలెంకాను ఓడించింది.

న్యూయార్క్ లోని ఆర్ధర్ ఆష్ స్టేడియంలో ఆసక్తికరంగా సాగిన ఈ టైటిల్ సమరంలో కోకో గాఫ్ తొలి సెట్ ను కోల్పోయింది.అయినప్పటికీ ధైర్యన్ని పుంజుకొని తర్వాత వరుసగా రెండు సెట్లు చేజిక్కించుకుని విజేతగా నిలిచింది. ఫ్లోరిడాకు చెందిన 19 ఏళ్ల కోకో గాఫ్ కు కెరీర్ లో ఇదే తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్. మొదటి గ్రాండ్ స్లామ్ ను సొంతగడ్డపై గెలవడంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 1999లో సెరెనా విలియమ్స్ తర్వాత యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌ గెలిచిన తొలి అమెరికన్ టీనేజర్‌గా కోకో గాఫ్ చ‌రిత్ర సృష్టించింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button