తెలుగు
te తెలుగు en English
సినిమా రివ్యూ

మూవీ రివ్యూ: ఫైటర్(హిందీ)

Pakka Telugu Rating : 3/5
Cast : హృతిక్ రోషన్, దీపికా పదుకొనే, అనిల్ కపూర్, కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఒబెరాయ్ తదితరులు
Director : సిద్ధార్థ్ ఆనంద్
Music Director : విశాల్-శేఖర్
Release Date : 25/01/2024

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, హీరోయిన్ దీపిక పదుకోణే నటించిన లేటెస్ట్ మూవీ ‘ఫైటర్’. ఏరియల్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ మూవీకి ‘వార్’, ‘పఠాన్’ వంటి హిట్ సినిమాలు అందించిన సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. కాగా, ‘బ్యాంగ్ బ్యాంగ్’, ‘వార్’ తర్వాత హృతిక్ రోషన్ నుంచి వస్తున్న ‘ఫైటర్’ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్‌లో రావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరో వైపు టీజర్, ట్రైలర్ మూవీ అంచనాలని నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లగా.. గణతంత్ర దినోత్సవ సందర్బంగా ఈ మూవీ జనవరి 25న ప్రేక్షకుల ముందుకొచ్చింది. వయాకామ్ 18 స్టూడియోస్, మార్ ఫ్లిక్స్ పిక్చర్స్ బ్యానర్లపై మమతా ఆనంద్, రామన్ చిబ్, అంకు పాండే ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం!

కథ:

షంషేర్ పఠానియా (హృతిక్ రోషన్) ఎయిర్ ఫోర్స్ పైలట్. అతనితో పాటు మినల్ రాథోర్ (దీపికా పదుకోణే), సర్తాజ్ గిల్ (కరణ్ సింగ్ గ్రోవర్), బషీర్ ఖాన్ (అక్షయ్ ఒబెరాయ్) అందరూ పైలట్స్. అయితే వీరందరినీ ఒక టీంగా కమాండ్ ఆఫీసర్ రాకీ అలియాస్ రాకేష్ జై సింగ్ (అక్షయ్ కుమార్) ఏర్పాటు చేస్తారు. ఇందులో షంషేర్ పఠానియా తనను తాను పైలట్ అని కాకుండా ఫైటర్ అని భావిస్తాడు. ఈ తరుణంలో పుల్వామాలో తీవ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్‌లోని టెర్రరిస్ట్ క్యాంపుపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సర్జికల్ స్ట్రైక్ చేస్తుంది. ఇందులో సర్తాజ్ గిల్, బషీర్ ఖాన్‌లు పాక్ ఆర్మీకి చిక్కుతారు. ఆ తర్వాత ఆ ఇద్దరిని రక్షించేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎలాంటి చర్యలు చేపట్టింది? ఆ తర్వాత వచ్చిన చిక్కులు ఏంటి? ఫైనల్‌గా సర్తాజ్, బషీర్ ప్రాణాలను కాపాడారా? అనే వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

క‌థ‌నం-విశ్లేషణ:

‘ఫైటర్’ సినిమా ఇండో, పాక్ & టెర్రరిస్ట్ నేపథ్యంలో తీశారు. ప్రధానంగా ఈ సినిమా కథ, కథనంలో హ్యూమన్ ఎమోషన్స్ టచ్ చేశారు. ఇందులో యాక్షన్ కంటే ఎక్కువ డ్రామా మీద ఫోకస్ చేశారు. ఒక దేశంలో ఇద్దరు బెస్ట్ పైలట్స్ ఉంటే.. వారి మధ్య మనస్పర్థలు రాకుండా.. ఓ సైనికుడికి దేశం కంటే ఎక్కువ కాదని చెప్పడానికి చేసిన యుద్ధంలా డైరెక్టర్ తీశారు. ఇందులో షంషేర్ పఠానియా(హృతిక్) అద్భుతంగా నటించాడని, తన స్క్రీన్ ప్రెజెన్స్ తో సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లారు. ఇక ఇండియాలో బాంబు పేలుళ్లకు కారణమైన తీవ్రవాదుల మీద మన ఎయిర్ ఫోర్స్ చేసిన యుద్ధం నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి అయితే ఈ సినిమాలో దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. టెర్రరిజం కంటే ఎయిర్ ఫోర్స్ పైలట్స్, వాళ్ల క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఎక్కువ టైం తీసుకున్నారు. ‘ఫైటర్’లో భారీ యాక్షన్ థ్రిల్స్, యాక్షన్ సన్నివేశాలకు తక్కువగా ప్రియారిటీ ఇచ్చి డ్రామా, ఎమోషన్ ‌పై ఫోకస్ పెట్టారు. సిద్ధార్థ్ ఆనంద్ ఎంపిక చేసుకున్న కథ, కథనం, సన్నివేశాల్లో కొత్తదనం కనిపించ లేదు. అయితే ఎయిర్ ఫోర్స్ నేపథ్యంతో పాటు నటీనటులు ఈ సినిమాకు కొత్తదనం తీసుకొచ్చారు. అయితే కథ కొంత సాగదీసినట్లుగా అనిపిస్తుంది. కానీ ఎక్కడ కూడ ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా చొరవ తీసుకున్నారు. ప్రేక్షకులు వార్, పఠాన్ చూసిన తర్వాత ఈ సినిమా మీద కూడా ఒక రకమైన అంచనా ఏర్పడడం ఖాయం.

న‌టీ-న‌టులు:

హృతిక్ రోషన్ వన్ మ్యాన్ షో చాలా సన్నివేశాలను నిలబెట్టింది. పైలట్ పాత్రలో హ్యాండ్సమ్ లుక్స్, స్మైలీ ఫేస్, ఎమోషనల్ సన్నివేశాల్లో హృతిక్ ఆకట్టుకున్నారు. దీపికా పదుకోణే ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ పాత్రలో కొత్తగా అనిపించింది. వీరి మధ్య కెమిస్ట్రీ సూపర్. ఇక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ పాత్ర అమ్మాయిలకు, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలలు కనే వారికి స్ఫూర్తిగా నిలవనుంది. ఇక అక్షయ్ కుమార్, కరణ్ సింగ్ గ్రోవర్, అభిషేక్ ఒబెరాయ్‌లు తమ పాత్రలకు ప్రాణం పోశారు. కానీ టెర్రరిస్ట్ పాత్రలో విలన్ మాత్రం అంతగా ఆకట్టుకునేలా లేదు.

సాంకేతిక వర్గం:

సచ్చిత్ పౌలోస్ సినిమాటోగ్రఫీ అత్యున్నతంగా ఉంది. ఎడిటర్ ఆరిఫ్ షేక్ ఈ సినిమాకి పేసీ రిథమ్‌ను అందించాడు. ఏరియల్ కాంబాట్, ఎమోషన్స్, దేశ భక్తి, డ్రామా వంటి సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. విశాల్-శేఖర్ సంగీతంలో ఆకట్టుకోలేకపోయారు. దీంతోపాటు డాన్స్ పెద్దగా కనిపించ లేదు. కానీ సిద్ధార్థ ఆనంద్ తనను తాను మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఓవరాల్‌గా స్టోరీ, ప్రెజెంటేషన్, వీఎఫ్‌ఎక్స్, బీజీఎమ్, యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ ఫైటర్ టీం సాలిడ్‌గా ప్లాన్ చేసింది.

ప్లస్ పాయింట్స్:

హృతిక్ నటన

దేశభక్తి కాన్సెప్ట్, ఎమోషన్స్

విజువల్స్

మైనస్ పాయింట్స్:

కొత్తదనం లోపించడం

ఆకట్టుకోని మ్యూజిక్

డ్యాన్స్ వంటి సన్నివేశాలు లేకపోవడం

పంచ్‌లైన్: కమర్షియల్ మూవీ లవర్స్‌కు నచ్చే ఫైటర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button