తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Janhvi Kapoor: దేవర మూవీ అప్డేట్.. హీరోయిన్ పోస్టర్ రిలీజ్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీకపూర్ తెలుగులో దేవ‌ర‌తో పాటు ఆర్‌సీ16 సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇవాళ జాన్వీకపూర్ బర్త్ డే సందర్భంగా ‘దేవర’ టీం అప్డేట్ ప్రకటించింది. ఈ మేరకు దేవ‌ర మూవీ నుంచి జాన్వీ క‌పూర్ కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. జాన్వీకపూర్.. శ్రీదేవి గార‌ల‌ప‌ట్టిగా వెండితెరకు పరిచయమైంది. కాగా, ఇప్ప‌టికే ఆర్‌సీ16 నుంచి జాన్వీకపూర్‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.

ALSO READ: ఓటిటిలోకి వచ్చేస్తున్న మెర్రీ క్రిస్మస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్‌ హీరోగా.. కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న చిత్రం ‘దేవర’. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. తొలిభాగం 2024 అక్టోబ‌ర్ 10న‌ విడుద‌ల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి తార‌క్ లుక్‌తో పాటు, సైఫ్ అలీఖాన్, జాన్వీకపూర్ లుక్‌ల‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాయి.

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button