తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Lambasingi: అందమైన ప్రేమకథ “లంబసింగి”… వయ్యారి గోదారి సాంగ్ రిలీజ్

వేసవిలో సిమ్లా, ఊటీ, కశ్మీర్ వంటి హిల్ స్టేష‌న్స్‌కు టూర్ వేయాలని చాలా మంది అనుకుంటారు! ఎందుకంటే… అక్కడ చల్లగా ఉంటుంది కాబట్టి! ఆంధ్రాలోనూ అటువంటి హిల్ స్టేషన్ ఒకటి ఉంది. ఆంధ్రా కశ్మీర్‌గా పాపులర్ అయ్యింది. అదే ‘లంబసింగి’. ఇప్పుడీ ఊరి పేరుతో ఓ సినిమా రూపొందుతోంది.

Also Read: ‘షరతులు వర్తిస్తాయి’ లిరికల్ సాంగ్ రిలీజ్

‘లంబసింగి’ చిత్రంతో ప్రముఖ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టారు. నవీన్ గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. భరత్‌ రాజ్ ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ… ‘బిగ్ బాస్’ ఫేమ్ దివి కథానాయికగా కాన్సెప్ట్ ఫిల్మ్స్ పతాకంపై ఆనంద్.టి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘ఎ ప్యూర్ లవ్ స్టోరీ.’.. అనేది ఉపశీర్షిక.

Also Read: ఆసక్తికరంగా బస్తర్ ట్రైలర్… ఆదా శర్మకు మరో హిట్ పడినట్లేనా?

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న లంబసింగి చిత్రం మార్చి 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా మొదటిపాట ‘నచ్చేసిందే నచ్చేసిందే…’ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా నుండి వయ్యారి గోదారి సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. జవేద్ అలీ ఆలపించిన ఈ సాంగ్ ను కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. ఆర్ఆర్ ధ్రువన్ సంగీతం అందించారు. డిఫరెంట్ మెలోడీ గా సాగే ఈ సాంగ్ కు మ్యూజిక్ లవర్స్ నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button