తెలుగు
te తెలుగు en English
మరిన్ని

Bastar: ఆసక్తికరంగా బస్తర్ ట్రైలర్… ఆదా శర్మకు మరో హిట్ పడినట్లేనా?

గ‌తేడాది ‘ది కేరళ స్టోరీ’ చిత్రంతో హీరోయిన్ ఆదా శర్మ సంచలన విజ‌యం అందుకుంది. ఇక ఈ సినిమా ప్రశంసలతో పాటు విమ‌ర్శ‌లు కూడా అందుకుంది. అయితే ఈ సినిమా అనంత‌రం ఆదా శర్మ మ‌ళ్లీ కేరళ స్టోరీ చిత్ర యూనిట్‌తో చేతులు క‌లిపింది. ఆమె తాజాగా నటిస్తున్న చిత్రం ‘బస్తర్‌: ది నక్సల్‌ స్టోరీ’. ఈ సినిమాకు కేరళ స్టోరీ ద‌ర్శ‌కుడు సుదీప్తో సేన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. విపుల్ అమృత్‌లాల్ షా, ఆషిన్ ఎ షా నిర్మాతలుగా వ్య‌వ‌హారిస్తున్నారు.

Also Read: శర్వానంద్ బర్త్‌డే స్పెషల్… ‘మనమే’ టైటిల్ మేకింగ్ వీడియో రిలీజ్

ఇప్ప‌టికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం మార్చి 15న విడుద‌ల కానుంది. ఇక విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర‌ప‌డ‌టంతో ఇప్ప‌టికే మూవీ నుంచి టీజ‌ర్ విడుద‌ల చేయ‌గా మంచి రెస్పాన్స్ ద‌క్కించుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి మేక‌ర్స్ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ ప్రాంతంలో జరిగిన మావోయిస్టుల అమానుషాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందిస్తున్నట్లు ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. ఇక ఈ సినిమాలో మావోయిస్టులను ప‌ట్టుకునే ఐపీఎస్‌ అధికారి నీరజా మాధవన్ పాత్ర‌లో ఆదా శర్మ క‌నిపించ‌నుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button