తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Rajamouli: మహేశ్ బాబుతో మూవీపై రాజమౌళి బిగ్ అప్‌డేట్

పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి- సూపర్ స్టార్ మహేశ్‌బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీపై బిగ్ అప్‌డేట్ అందింది. ఈ మూవీకి సంబంధించి రాజమౌళి అప్‌డేట్ ఇచ్చారు. ఇటీవల జపాన్‌ వెళ్లిన ఆయన అక్కడ మీడియాతో మాట్లాడారు. ‘మహేశ్‌ బాబుతో సినిమా చేస్తున్నా. ఆయన మంచి నటుడు. చాలా అందంగా ఉంటారు. మీలో కొందరికి ఆయన గురించి తెలిసే ఉంటుంది. ఈ చిత్రానికి సంబంధించి ప్రీప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. త్వరలో చిత్రీకరణను ప్రారంభిస్తాం.’ అని అన్నారు.

ALSO READ: సినీ ప్రియుల కోసం క్రేజీ న్యూస్… 6 సినిమా/వెబ్ సిరీస్ అప్డేట్స్

కాగా.. రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ మూవీలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్‌ను సొంతం చేసుకోవడంతో ఆ క్రేజ్ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల జపాన్ వెళ్లిన రాజమౌళి.. అక్కడి ప్రేక్షకులతో కలిసి మరోసారి ‘ఆర్ఆర్ఆర్’ మూవీని వీక్షించారు. ఈ సందర్భంగా రాజమౌళి.. అక్కడి మీడియాతో సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేయనున్న తన తదుపరి చిత్రం గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button