తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Sampoornesh Babu: మార్టిన్ లూథర్ కింగ్ గా సంపూర్ణేశ్ బాబు …ఫస్ట్ లుక్ విడుదల

అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి తన మొదటి మూవీ హృదయ కాలేయంతో భారీ హిట్ అందుకున్నాడు బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు.అందులో తన నటనకు ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వుకున్నారు. అప్పటి నుంచి ప్రేక్షకులను నవ్వించడామే పనిగా ముందుకు సాగుతున్నాడు. తర్వాత సింగం 123 తనకున్నంత పేరు తీసుకురాకున్న…కొబ్బరిమట్టతో మరో హిట్ కొట్టాడు. అయితే చాలా కాలం గ్యాప్ తర్వాత ఇప్పుడు మరో మూవీ ఆప్ డేట్ తో మన ముందుకు వచ్చాడు సంపూర్ణేశ్ బాబు. ఈ సారి ఓ రీమేక్ చిత్రంలో నటించనున్నాడు.

కొత్త అమ్మాయి పూజా అపర్ణ కొల్లూరు డైరెక్షన్ లో సంపూర్ణేశ్ బాబు మార్టిన్ లూథర్ కింగ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. తమిళంలో స్టార్ కమెడియన్ యోగిబాబు నటించిన మండేలా చిత్రానికి ఇది రీమేక్. మహాయాన మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై శశికాంత్, చక్రవర్తి రామచంద్ర నిర్మాతలుగా ఈ పొలిటికల్ ఎంటర్టయినర్ తెరకెక్కుతోంది.

మార్టిన్ లూథర్ కింగ్ చిత్రం నుంచి సంపూ ఫస్ట్ లుక్ ను చిత్రబృందం విడుదల చేసింది. ఫస్ట్ లుక్ చూస్తేనే సినిమా జానర్ ఏంటన్నది అర్థమవుతోంది. సంపూ ట్రేడ్ మార్క్ వినోదానికి లోటు ఉండదని స్పష్టం చేస్తోంది. ఈ చిత్రం అక్టోబరు 27న ప్రేక్షకుల ముందుకు వస్తోందని చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రాన్ని దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ రిలీజ్ చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button