తెలుగు
te తెలుగు en English
జాతీయం

Delhi: కేజ్రీవాల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేసిన ఢిల్లీ హైకోర్టు

భారతదేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేజ్రీవాల్ పిటిషన్ పై తీర్పును ఢిల్లీ హైకోర్టు రిజర్వ్ చేసింది. ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. కేజ్రీవాల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో 2 గంటల పాటు వాదనలు సాగాయి.

Also Read: కాషాయం గూటికి ఎంపీ సుమలత.. ఎన్నికల్లో పోటీచేయనని వెల్లడి

ఈ సందర్భంగా కేజ్రీవాల్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింగ్వీ వాదనలు వినిపిస్తున్నారు. తన క్లైంట్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు లేవన్నారు. కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేసేముందు ఆయన నివాసం వద్ద ఎటువంటి స్టేట్‌మెంట్‌ తీసుకోలేదని కోర్టుకు తెలిపారు. అరెస్టు​కు ముందు ఈడీ అసలు అటువంటి ప్రయత్నమే చేయలేదని కోర్టుకు తెలిపారు.

Also Read: లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్… వారిని భయపెట్టడానికేనా?

అనంతరం కేజ్రీవాల్ మీడియాతో తనను అరెస్ట్ చేయడంపై సీరియస్ అయ్యారు. తనను అవమానించడమే ఈడీ ఏకైక లక్ష్యమని కేజ్రీవాల్ ఆరోపించారు. ఎంపీ ఎలక్షన్స్ కంటే ముందు తనను నిరోధించడమే వారి టార్గెట్ అని కేజ్రీవాల్ ఆరోపించారు. అయితే ఈడీ అరెస్ట్ ను సవాల్ చేస్తూ ఢిల్లీ హై కోర్టులో పిటిషన్ వేసిన కేజ్రీవాల్ తనకు మధ్యంతర ఉపశమనం కల్పించాలని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button