తెలుగు
te తెలుగు en English
జాతీయం

India: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. మాల్దీవులకు సాయం

ఆహారపదార్ధాలను విదేశాలకు ఎగుమతి చేసే విషయంలో భారతదేశం కీలక నిర్ణయం తీసుకుంది. మాల్దీవులకు గుడ్లు, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, బియ్యం, గోధుమ పిండి, చక్కెర, పప్పులు వంటి వాటిని ఎగుమతి చేసేందుకు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. భారతదేశం – మాల్దీవులతో వాణిజ్య సంబంధాల విషయంలో గణనీయమైన అభివృద్ధిని సాధించింది. వీటితో భవన నిర్మాణ సామాగ్రిని కూడా ఎగుమతి చేయాలని నిర్ణయం తీసుకుంది. కంకర రాయి.. ఇసుకను మాల్దీవుల ప్రభుత్వం అభ్యర్థన మేరకు పంపేందుకు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ప్రకారం 2024–25 ఆర్దిక సంవత్సరానికి ఎగుమతి చేయనుంది.

మాల్దీవుల ప్రభుత్వం చేసిన అభ్యర్థనకు ప్రతిస్పందిస్తూ మాల్దీవులకు అవసరమైన వస్తువుల కోసం భారతదేశం అత్యధిక ఎగుమతి కోటాలను మంజూరు చేసింది. 2024–25 సంవత్సరానికి వివిధ వస్తువుల కోటాలు గణనీయంగా పెంచబడ్డాయి. ఇది రెండు దేశాల మధ్య దీర్ఘకాల వాణిజ్య సంబంధాలను మెరుగుపరుస్తుంది.

Also read: Modi: మీకు ఈ విషయం తెలుసా?… మోడీ ఆస్తి వీళ్లందరి కంటే తక్కువ!

భారత ప్రభుత్వం మాల్దీవులకు 42 కోట్ల 75 లక్షల 36 వేల 904 గుడ్లను ఎగుమతి చేయడానికి అనుమతి ఇచ్చింది. 21 వేల 513 టన్నుల బంగాళదుంప, 35వేల 749 టన్నుల ఉల్లిగడ్డలు, బియ్యం ఎగుమతికి లక్షా 24 వేల 218 టన్నుల బియ్యం, లక్షా 9 వేల 162 టన్నుల గోధుమ పిండి, 64 వేల 494 టన్నుల చక్కెర, 224 టన్నుల పప్పును ఎగుమతి చేసేందుకు పరిమితిని విధించింది.

భారత ప్రభుత్వ వాణిజ్యం & పరిశ్రమల మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌లో, 2024-25లో రిపబ్లిక్ ఆఫ్ మాల్దీవులకు ఎగుమతి చేయడానికి అనుమతించిన వస్తువులను వివరించారు. మాల్దీవులకు ఎగుమతి చేయాల్సిన గుడ్లు, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, బియ్యం, గోధుమ పిండి, చక్కెర, పప్పు, రాయి కంకర, ఇసుక పరిమాణాలను గెజిట్ ఆఫ్ ఇండియా ఎక్స్‌ట్రార్డినరీలో ప్రచురించిన నోటిఫికేషన్ లో వివరించింది.

4 Comments

Leave a Reply to vpn 2024 Cancel reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button