తెలుగు
te తెలుగు en English
జాతీయం

PM Modi: భూటాన్ లో ప్రధాని పర్యటన.. అత్యున్నత పౌర పురస్కారం ప్రదానం

ప్రధాని నరేంద్రమోడీ రెండు రోజుల పాటు భారత సరిహద్దు దేశం భూటాన్ లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా భూటాన్ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ద డ్రక్ గ్యాల్పో’ను ప్రధాని నరేంద్రమోడీకి అందించింది. భూటాన్ రాజు జిగ్మే నాంగ్యల్ వాంగ్ చుక్ స్వయంగా ప్రధాని మోడీకి ప్రదానం చేశారు.

Also read: Supreme Court: కవితకు సుప్రీంకోర్టులో షాక్.. బెయిల్ ఇవ్వలేమని వెల్లడి

పురస్కారం పొందిన తర్వాత ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘ఈ రోజు నా జీవితంలో చాలా పెద్ద రోజు, నాకు భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం లభించింది. ప్రతీ అవార్డు ప్రత్యేకమైంది, కానీ మీరు అవార్డును వేరే దేశం నుంచి అందుకున్నప్పుడు, రెండు దేశాలు కూడా సరైన మార్గంలో వెళ్తున్నాయని చూపిస్తుంది. ప్రతీ భారతీయుడి తరపున ఈ అవార్డును నేను తీసుకుంటున్నాను’ అని అన్నారు.

భూటాన్ ప్రతిష్టాత్మక పౌర పురస్కారాన్ని అందుకున్న తొలి విదేశీ నేతగా ప్రధాని మోడీ చరిత్ర సృష్టించారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న మోడీకి ఇది మూడో అత్యున్నత విదేశీ పురస్కారం. అంతకుముందు ఈ అవార్డును కేవలం నలుగురికి మాత్రమే భూటాన్ ప్రదానం చేసింది. 2008లో రాయల్ క్వీన్ అమ్మమ్మ ఆషి కేసాంగ్ చోడెన్ వాంగ్ చుక్ కి, 2008లో హిస్ హోలీనెస్ జె త్రిజుర్ టెన్జిన్ డెండప్ కి, 2018లో హిస్ హోలీనెస్ జె ఖెన్పో ట్రల్కు న్గావాంగ్ జిగ్మే చోడ్రా ఈ అవార్డును అందించారు.

అంతకు ముందు భూటాన్ పారో విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోడీకి ఆదేశ ప్రధాని షోరింగ్ టోబ్గే ఘన స్వాగతం పలికారు. పారో నుంచి రాజధాని థింపు వరకు 45 కిలోమీటర్ల పొడవున ప్రజలు బారులుతీరి మోడీకి ఘన స్వాగతం పలికారు. ఇరుదేశాల మధ్య పెట్రోలియం ఉత్పత్తులు, ఆహారం, ఇంధన సహకారం, క్రీడలు, యువత భవిష్యత్తు, ఔషధ ఉత్పత్తులలో సహకారం, అంతరిక్ష సహకారం లాంటి ఒప్పందాలపై సంతకాలు చేయనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button