తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

TS- TET: టెట్ అభ్యర్థులకు శుభవార్త.. ఇక నుంచి 8 భాషాల్లో ప్రశ్నాపత్రం

తెలంగాణలో టీచర్ ఎలిజిబెలిటీ టెస్ట్ (టెట్)–2024 అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఈసారి పరీక్షకు పశ్నాపత్రాన్ని రెండు భాషల్లో ముద్రించనున్నారు. ఇంగ్లిష్ ​తో పాటు తెలుగు, ఉర్దూ, హిందీ, బెంగాలి, కన్నడ, మరాఠీ, తమిళం, గుజరాతి, తమిళం తదితర 8 భాషాల్లో ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఈ సారి కూడా టెట్ మార్కులకు డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ కల్పించారు. పేపర్–1 ను ఐదో తరగతి వరకు టీచర్​గా ఉండాలనుకునే వారికి, పేపర్​–2 ఆరో తరగతి నుంచి 8వ తరగతి వరకు టీచర్ ​గా ఉండాలనుకునే వారు అప్లై చేసుకోవచ్చు.

Also read: PM Modi: భూటాన్ లో ప్రధాని పర్యటన.. అత్యున్నత పౌర పురస్కారం ప్రదానం

మరో వైపు టెట్ పరీక్ష ఫీజు వెయ్యి రూపాలయలుగా ప్రభుత్వం నిర్ణయించింది. రెండు పేపర్లు రాస్తే రూ.2 వేలు చెల్లించాలి. గతంలో ఒక్క పేపర్​ రాసినా.. రెండు పేపర్లు రాసిన ఎగ్జామ్​ ఫీజు రూ.400 లే ఉండేది. ప్రస్తుతం పెంచిన ఫీజును చూసి అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఆన్​లైన్ ఎగ్జామ్ కావడంతో ఫీజును భారీగా పెంచినట్టు సమాచారం. శుక్రవారం రాత్రి విద్యాశాఖ టెట్ డిటైల్డ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. మే 20 నుంచి జూన్ 3 వరకు పరీక్షలు నిర్వహిస్తామని, జూన్ 12న ఫలితాలు ప్రకటిస్తామని స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన వెల్లడించారు. పూర్తి వివరాలకు https://schooledu.telangana.gov.inను చూడాలన్నారు. అయితే, టీచర్ల ప్రమోషన్లకు టెట్ క్వాలిఫై తప్పనిసరి కావడంతో, టీచర్లూ, ఇన్ సర్వీస్ టీచర్లు దరఖాస్తు చేసుకునేందుకు ఈ సారి అవకాశం కల్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button