Congress: అది బీఆర్ఎస్ తప్పే… కేటీఆర్ కు మంత్రి సీతక్క కౌంటర్
ప్రభుత్వం సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని..లేదంటే వారి తరుఫున గొంతు విప్పుతామని మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయనకు మంత్రి సీతక్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సర్పంచ్లకు నిధులు ఇవ్వకుండా బాధపెట్టింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. ఇప్పుడు ఇదే బీఆర్ఎస్ పార్టీ నేతలు, మాజీ మంత్రి కేటీఆర్ సర్పంచ్ల కోసం మాట్లాడటం విడ్డూరంగా ఉందని సీతక్క ఎద్దేవా చేశారు.
Also Read: టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త… ప్రమాద బీమా పెంపు… ఎంతంటే?
కేటీఆర్ మాటలు వెయ్యి పశువులను తిన్న రాబందు నీతి కథలు చెప్పినట్లు ఉందని సీతక్క దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. ఇంట్లో ఆడవాళ్ల పుస్తెల తాళ్లు అమ్మి మరీ సర్పంచులు అభివృద్ధి పనులు చేస్తే.. అప్పటి బీఆర్ఎస్ సర్కార్ ఫండ్స్ రిలీజ్ చేయలేదని మండిపడ్డారు. దాంతో చేసేదేమి లేక ఎంతో మంది సర్పంచులు సూసైడ్ చేసుకున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలోని సర్పంచుల ఆత్మహత్యలకు బీఆర్ఎస్ పార్టీనే కారణమని ఆరోపించారు.