తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

DSC: డీఎస్సీ పరీక్షల తేదీలు ఖరారు.. ప్రకటించిన విద్యాశాఖ

తెలంగాణలో వెలువడిన మెగా డీఎస్సీపై ఎంతోమంది నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. 11 వేల ఉపాధ్యాయ పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. DSC 2024 పరీక్షలు జులై 17 నుంచి 31 వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో టైం టేబుల్ పెట్టింది. ఇప్పటికే డీఎస్సీ దరఖాస్తు గడువును జూన్ 20 వరకు పొడిగించింది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.1000 చెల్లించి జూన్ 20 రాత్రి 11.50 గంటల వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.

Also read: Taiwan: తైవాన్ లో భారీ భూకంపం.. జపాన్ లో సునామీ

డీఎస్సీ కంటే ముందుగా టెట్ నిర్వహించాల్సిందేనని హైకోర్టు ఆదేశించగా.. అధికారులు ఉన్నపళంగా టెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. గరిష్ఠ వయోపరిమితిని 46 సంవత్సరాలకు పెంచడం, అదనంగా పోస్టులను చేర్చడంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరుగుతుందని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గత నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసిన వాళ్లు ఆయా పోస్టులకు మళ్లీ కొత్తగా దరఖాస్తులు సమర్పించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button