తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం
Trending

ఏప్రిల్ 18: చరిత్రలో ఈరోజు

అంతర్జాతీయ చారిత్రక కట్టడాల దినోత్సవం/ ప్రపంచ వారసత్వ దినోత్సవం

అంతర్జాతీయ చారిత్రక కట్టాడాల దినోత్సవాన్ని నేడు జరుపుకుంటారు. ఐక్యరాజ్యసమితిలోని సభ్యదేశాలు వారసత్వ సంపద పరిరక్షణ కోసం ఒకరికొకరు పలు అంశాల్లో పరస్పరం సహకరించుకోవాలనే లక్ష్యంత ఈరోజును నిర్వహిస్తున్నారు. ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని మొదటిసారిగా 1983 నుంచి జరిపారు. భారత్ నుంచి 40 ప్రదేశాలు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో స్థానం సంపాదించాయి.

మాల్కం మార్షల్ పుట్టినరోజు

వెస్టిండీస్ మాజీ క్రికెటర్, బౌలర్ మాల్కం మార్షల్ 1958 బార్బడస్ లోని బ్రిడ్జిటౌన్ లో జన్మించారు. ఇప్పటి వరకు టెస్ట్ క్రికెట్ ఆడిన అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా పేరుపొందారు. టెస్ట్ క్రికెట్ లో 20.94 సగటుతో 200 పైగా వికెట్లు సాధించారు. దాదాపు 8వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చే మార్షల్ ప్రత్యర్థులను ఆడుకునేవాడు. ఆ స్థానంలో ఆయన టెస్టుల్లో 10 అర్ధ శతకాలు సాధించారు. మొత్తంగా టెస్టుల్లో 376, వన్డేల్లో 157 వికెట్లు సాధించారు.

హెన్రీ డెరోజియో పుట్టినరోజు

అధ్యాపకుడు, పండితుడు, కవి హెన్రీ లూయీ వివియన్ డెరోజియో 1809 కలకత్తాలో జన్మించారు. కలకత్తాలో హిందూ కళాశాలకు నియమిత అధ్యాపకునిగా పనిచేశారు. ఈయన యురేషియన్, పోర్చుగీసు సంతతికి చెందిన విద్యావేత్త. కానీ ఈయన తనను తాను భారతీయునిగా భావించుకున్నారు. ఈయన కవితలలో ఫకీర్ ఆఫ్ ఝంగీరా ప్రసిద్ధమైనది.

ఆల్బర్ట్ ఐన్ స్టీన్ మరణం

జర్మనీకి చెందిన భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్ స్టీన్ 1955 అమెరికాలోని న్యూజెర్సీలో ప్రిన్స్టన్ లో మరణించారు. ఈయన 1879 మార్చి 14న జర్మన్ సామ్రాజ్యంలోని వుర్టంబెర్గ్ లోని ఉల్మ్ లో జన్మించారు. ఆధునిక భౌతికశాస్త్రానికి మూలమైన రెండు సిద్ధంతాల్లో ఒకటైన జనరల్ థియరీ ఆప్ రిలెటివిటీని ప్రతిపాదించారు. E=mc2 ఫార్ములాను కనిపెట్టాడు. 1921లో భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. క్వాంటం థియరీ పరిణామ క్రమం అందుకు సంబంధించిన ఎలక్ట్రిక్ లా ను కనిపెట్టినందుకు ఈ బహుమతి అందుకున్నారు.

తాంతియా తోపే మరణం

భారత స్వాతంత్య్ర సమరయోధుడు తాంతియా తోపే 1859 శివపురిలో బ్రిటీష్ వారి చేతిలో ఉరివేయబడ్డారు. ఈయన అసలు పేరు రామచంద్ర పాండిరంగ తోపే. ఈయన 1814 ఫిబ్రవరి 16న మహారాష్ట్రలోని నాసిక్ లో యోలా వద్ద జన్మించారు. ఈయన 1857 నవంబరు ప్రారంభంలో గ్వాలియర్ రాష్ట్ర తిరుగుబాటు దళాలకు నాయకత్వం వహించారు.

కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి మరణం

ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి 2015 హైదరాబాద్ లో మరణించారు. అందరూ ఆయన్ని శ్రీ అని పిలుస్తారు. ఈయన 1966 సెప్టెంబర్ 13న గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లు వద్ద జన్మించారు. 1993లో రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన గాయం సినిమా శ్రీ కెరీర్ కు టర్నింగ్ పాయింట్. అందులో సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అనే గీతం బాగా పేరు తెచ్చింది. ఆ తర్వాత మనీ, మనీ మనీ, అనగనగా ఒకరోజు సినిమాలకు సంగీతాన్ని అందించారు. సింధూరం మూవీ ఆయన కెరీర్లో అతి పెద్ద విజయం. అప్పూ అనే బాలల చిత్రం ఆయన చివరి చిత్రం.

మరిన్ని విశేషాలు

భారత స్వాతంత్య్ర సంగ్రామంలో 1930లో సూర్యసేన్ ఇతర విప్లవకారులతో కలిసి ప్రాంతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు చిట్టాగాంగ్ లోని ఆయుధగారాన్ని ముట్టడించారు.

అల్లూరి సీతారామారాజు నేతృత్వంలో 1923లో అన్నవరం పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు.

మారాఠా సామ్రాజ్యంలో 14వ పేష్వా సవాయ్ మాధవరావ్ 1774లో జన్మించారు.

విమర్శకులు, పండితులు టేకుమళ్ళ అచ్యుతరావు 1880 విశాఖ జిల్లాలోని పోతనవలసలో జన్మించారు.

ప్రముఖ వీధి నాటక ప్రముఖులు అత్తిలి కృష్ణారావు 1938 విశాఖపట్నంలో జన్మించారు.

కర్నూలు మాజీ ఎంపీ యోమ్మిగనూరు గాదిలింగన్న గౌడ్ 1974 కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మరణించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button