తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

ఏప్రిల్ 20: చరిత్రలో ఈరోజు

నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు

భారత రాజకీయ నేత, టీడీపీ అధినేత, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, నవ్యాంధ్ర మొదటి సీఎం నారా చంద్రబాబునాయుడు 1950 చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో జన్మించారు. చంద్రబాబు 1978లో చంద్రగిరి అసెంబ్లీ స్థానం మొదటిసారిగా కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టంగుటూరి అంజయ్య మంత్రివర్గంలో అతి పిన్న వయస్సులోనే మంత్రిగా ఎంపికయ్యారు. 1981 సెప్టెంబర్ 10న ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిని వివాహమాడారు. 1983 ఎన్నికల అనంతరం టీడీపీలో చేరారు. 1995లో ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టి సెప్టెంబర్ 1న ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. 1994 నుంచి 2004 వరకు మరోమారు సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 2004 నుంచి 2014 వరకు ప్రతిపక్షనేతగా పనిచేశారు. 2014 నుంచి 2019 వరకు విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ప్రతిపక్షనేతగా వ్యవహరిస్తున్నారు.

అడాల్ఫ్ హిట్లర్ పుట్టినరోజు

జర్మనీ దేశ నియంత అడాల్ఫ్ హిట్లర్ లేదా ఎడాల్ఫ్ హిట్లర్ లేదా ఏడాల్ఫ్ హిట్లర్ 1889 ఆస్ట్రో హంగేరి సామ్రాజ్యంలో జన్మించారు. ఈయన 1933 నుంచి జర్మనీ ఛాన్సలర్ గాను, 1934 నుంచి మరణించే వరకు జర్మనీ నేత గాను వ్యవహరించారు.

కొప్పుల ఈశ్వర్ పుట్టినరోజు

తెలంగాణకు చెందిన రాజకీయ నేత, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ 1959 పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కుమ్మరికుంట గ్రామంలో జన్మించారు. 1994లో టీడీపీ తరపున పోటీచేసి స్వతంత్ర అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 2001లో టీఆర్ఎస్ లో చేరి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 2004లో ఎపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ పై పోటీచేసి మేడారం ఎమ్మెల్యేగా గెలిచారు. 2008లో జరిగిన ఉపఎన్నికల్లో మళ్లీ విజయం సాధించారు. 2009లో మేడారం స్థానం రద్దు చేయబడి కొత్తగా ఏర్పడిన ధర్మపురి నియోజవర్గం నుంచి విజయం సాధించారు. 2014, 2018లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019లో కేసీఆర్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు.

పి. శంకర్ రావు పుట్టినరోజు

కాంగ్రెస్ పార్టీ నేత, ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి పి. శంకర్ రావు 1948లో జన్మించారు. వైద్యశాస్త్రంలో డిగ్రీ పూర్తిచేశారు. 1983లో తొలిసారిగా షాద్ నగర్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి ఎన్నికయ్యారు. 1994లో టీడీపీ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు. 1999, 2004లో మళ్లీ షాద్ నగర్ నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్సార్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. 2009లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లోనూ మంత్రిగా పనిచేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులపై హైకోర్టులో పిటిషన్ వేశారు.

మమతా కులకర్ణి పుట్టినరోజు

భారతీయ నటి మమతా కులకర్ణి 1972 ముంబైలో జన్మించారు. ఆమె బెంగాలీ, హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించారు. ఈమె నట జీవితం, నటి తర్వాత జీవితం వివాదాల మయంగా మారింది. స్టార్ డస్ట్ పత్రిక బ్యానర్ పై టాప్ లెస్ పోజు ఇవ్వడంతో ఈమె పేరు వైరలైంది. ఈ వివాదంలో కోర్టుకు జరిమానా కూడా చెల్లించారు. తెలుగు ఈమె దొంగా పోలీస్, ప్రేమశిఖరం, బ్రహ్మ సినిమాల్లో నటించారు. విక్కీ గోస్వామితో కలిసి సహజీవనం చేశారు. విక్కీ డ్రగ్స్ వ్యాపారం చేస్తుండటంతో ఆమె కూడా వ్యాపారంలో భాగమైంది. 2014లో థానే పోలీసులు వీరి స్మగ్లింగ్ వ్యవహారాన్ని బయటపెట్టారు. అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్నారు. వీరిపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఉంది.

నీనా దావులూరి పుట్టినరోజు

అమెరికన్ అందాల పోటీ టైటిల్ విజేత, 2013 మిస్ న్యూయర్క్, 2014లో మిస్ అమెరికా టైటిల్ విజేత నీనా దావులూరి 1989 అమెరికాలోని న్యూయార్క్ సిరక్యూస్ లో జన్మించారు. మిస్ అమెరికాగా ఎంపికైన తొలి భారతీయ అమెరికన్ గా ఆమె చరిత్ర సృష్టించారు.

అంజలా జవేరీ పుట్టినరోజు

ప్రముఖ నటి అంజలా జవేరీ 1972 యూకేలోని లండన్ లో జన్మించారు. ఆమె తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అనేక చిత్రాల్లో నటించారు. 1997లో తొలిసారిగా ప్రేమించుకుందాం రా సినిమాలో నటించారు. అందులో నటనకు ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు. తర్వాత తెలుగులో చూడాలని వుంది, సమరసింహారెడ్డి, దేవీ పుత్రుడు, రావోయి చందమామ, ప్రేమసందడి, నాని, శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి చిత్రాల్లో నటించారు.

ఎమ్మెస్ రామారావు మరణం

తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నేపథ్య గాయకుడు ఎమ్మెస్ రామారావు 1992 హైదరాబాద్ లో కన్నుమూశారు. ఈయన పూర్తిపేరు మోపర్తి సీతారామారావు. ఈయనకు సుందరదాసు అనే పేరు ఉంది. ఈయన 1921 గుంటూరు జిల్లా అమృతలూరు మండలం మోపర్రు గ్రామంలో జన్మించారు. గేయ రూపంలో ఈయన రచించి గానం చేసిన రామాయణ భాగం సుందరకాండ ఎంతో ప్రఖ్యాతి గాంచింది. తులసీదాస్ రచించిన హనుమాన్ చాలీసాను తెలుగులోకి అనువదించి ఆకాశవాణిలో పాడారు.

మరిన్ని విశేషాలు

మొదటి పానిపట్ యుద్ధం 1526లో బాబర్ ఇబ్రహీం లోడీని ఓడించాడు.

బెల్జియంలో 7వ ఒలంపిక్ క్రీడలు 1920లో ఆంట్ వెర్ప్ లో ప్రారంభమయ్యాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పెమ్మత్స సత్యనారాయణరాజు 1966 న్యూఢిల్లీలో మరణించారు.

తెలుగు రచయిత, తెలుగు సినిమా ఆర్ట్ డైరెక్టర్, చిత్రకారుడు తాతా రమేశ్ బాబు 2017 కృష్ణా జిల్లా గుడివాడలో కన్నుమూశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button