తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

December 06: నేడు ప్రముఖుల పుట్టిన రోజు.. వీరే

డిశంబర్ 6.. నేడు పలువురు ప్రముఖులు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ముఖ్యంగా భారత్ స్టార్ పేస్ బౌలర్ జస్పిత్ బుమ్రా, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, స్టార్ బ్యాట్స్ మెన్ శ్రేయస్ అయ్యర్, క్రికెటర్ కరుణ్ నాయర్, అలాగే భారత జట్టు మాజీ క్రికెటర్ ఆర్పీసింగ్ నేడు పుట్టినరోజు నిర్వహించుకుంటున్నారు.

మరోవైపు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ శేఖర్ కపూర్, విక్రమాధిత్య మోత్వానీ పుట్టినరోజు నేడు. శేఖర్ కపూర్ టీవీలో ప్రసారమైన ఖందాన్ సీరియల్ తో పేరు పొందాడు. ఇక 1983లో వచ్చిన క్లాసిక్ హిట్ మసూమ్ సినిమాతో దర్శకుడిగా అరంగ్రేటం చేసి.. అందరి మన్ననలు పొందాడు. అలాగే 1994లో పూలన్ దేవీ జీవిత చరిత్ర ఆధారంగా బాండిట్ క్వీన్ సినిమాను తెరకెక్కించి అంతర్జాతీయ గుర్తింపు పొందారు. ఇక ఆయనకు గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు నామినేట్ అయ్యారు. అలాగే బాప్టా అవార్డు, నేషనల్ ఫిల్మ్ అవార్డు, నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ అవార్డ్ సహా.. మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులు, అనేక పురస్కారాలు దక్కాయి.

Read also: Chicken: మాంసాహారులకు మరో గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్ రేటు

ఇక మరో డైరెక్టర్, నిర్మాత, కథా రచయిత విక్రమాధిత్య మోత్వానీ బాలీవుడ్ సినిమాల్లో పేరుగాంచాడు. అతని డైరెక్షన్ లో ఉడాన్(2010), లూటేరా(2013), భవేష్ జోషి సూపర్ హీరో(2018), ఇండి(ఆర్) ఎమర్జెన్సీ(2023) వంటి సూపర్ హిట్ మూవీలను తెరకెక్కించి ప్రసిద్ధి చెందాడు. అలాగే ఉడాన్ చిత్రం 2010లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అన్ సెర్టైన్ రిగార్డ్ విభాగంలో పోటీకి ఎంపికైంది. అలాగే ఈ మూవీకి 7 ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు కూడా దక్కాయి. 2014లో జాతీయ చలనచిత్ర పురస్కారాలలో హిందీ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ లో అవార్డు దక్కించుకున్నారు. 2011, 2015, 2023 ఫిల్మ్ ఫేర్ అవార్డులు పొందారు. 2003, 2015లో ఉత్తమ సౌండ్ రికార్డింగ్, ఉత్తమ చిత్రం విభాగంలో ఐఫా అవార్డులు దక్కాయి. 2011, 2015 స్టార్ స్క్రీన్ అవార్డులు, 2011లో జీ సినీ అవార్డులు, 2014లో స్టార్ డస్ట్ పురస్కారాలు కైవసం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button