తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Chicken: మాంసాహారులకు మరో గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్ రేటు

మంసాహార ప్రియులకు మరో శుభవార్త. ఇన్ని రోజులు అకాశమే హద్దు పైకి పోయిన చికెన్ ధరలు ప్రస్తుతం నేలచూపులు చూస్తున్నాయి. ఒకానొక సందర్భంలో రూ. 300-500 వరకు పలికింది. నెలరోజులుగా తగ్గుతూ వస్తున్న కోడిమాంసం ధరలు మరోసారి భారీగా తగ్గాయి. కార్తీక మాసం, అయ్యప్ప దీక్షలు కొనసాగుతుండటం, మరోవైపు కోళ్ల ఉత్పత్తి భారీగా పెరగడంతో రేట్లు బాగా పడిపోయాయి.

Also read: Cyclone Effect: మిచౌంగ్ తుపాను.. తెలంగాణపై ఎఫెక్ట్

మొన్నటివరకు రాష్ట్రంలో ఎన్నికలు జరగడంతో ధరలు కాస్త ఊపందుకున్నాయి. అయితే ఇప్పుడు ఎన్నికలు ముగియడం, కార్తీక మాసంతో ధరలు ఒక్కసారిగా సగానికి సగం తగ్గాయి. ప్రస్తుతం కిలో చికెన్‌ విత్‌ స్కిన్‌ రూ. 150, స్కిన్‌లెస్‌ రూ. 170 కి తగ్గిపోయింది. మరి ఇప్పుడు మరో రూ. 20 తగ్గింది.. స్కిన్ లెస్ ధర రూ. 145 ఉండగా, విత్ స్కిన్ చికెన్ ధర ప్రస్తుతం రూ. 128 గా ఉంది. ధర ఇంకా తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. గడిచిన నాలుగు నెలల్లో కిలో చికెన్‌ ధర చేరుకున్న కనిష్ట ధర ఇదే కావడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button