తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

మార్చి 28: చరిత్రలో ఈరోజు

పుట్టపర్తి నారాయణాచార్యులు జననం

ప్రముఖ తెలుగు కవి పుట్టపర్తి నారాయణాచార్యులు 1914లో జన్మించారు. సంగీతం, సాహిత్యం మూర్తీభవించిన వ్యక్తిత్వం ఆయనది. తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు, బహుబాషా కోవిదుడు పుట్టపర్తి నారాయణాచార్యులు. ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు అభివర్ణించే శివతాండవ కావ్యం సృష్టికర్త ఈయనే. సెప్టెంబర్ 1, 1990న నారాయణాచార్యులు తుదిశ్వాస విడిచారు.

చిత్తూరు నాగయ్య జననం

ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, సంగీతకర్త, గాయకుడు, దర్శకుడు, నిర్మాత చిత్తూరు నాగయ్య 1904లో జన్మించారు. సినిమా రంగంపై ఆసక్తితో అందులోకి ప్రవేశించారు. ఆయన నటించిన పోతన, త్యాగయ్య, వేమన, రామదాసు వంటి అనేక పాత్రలు బహుళ ప్రజాదరణ పొందాయి. దక్షిణ భారతదేశంలో పద్మశ్రీ పురస్కారం పొందిన తొలినటుడు నాగయ్య. 336కి పైగా సినిమాల్లో నటించారు. 1938లో వచ్చిన గృహలక్ష్మి చిత్రంతో ఈయన సినీరంగ ప్రస్థానం ప్రారంభమైంది.

గుత్తి కేశవపిళ్లె దీవాన్ మరణం

ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, రాజకీయవేత్త, పాత్రికేయుడు దీవాన్ బహదూర్ పట్టు కేశవ పిళ్లై 1860 అక్టోబర్ 8న తమిళనాడులో జన్మించారు. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా జరిగిన అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పత్రికల్లో వ్యాసాలు రాసి ప్రజల్లో చైతన్యం నింపారు. 1916-17లో కాంగ్రెస్ సభ్యుడిగా చురుగ్గా పనిచేశాడు. 1933 మార్చి 28న తుదిశ్వాస విడిచారు.

కళా వెంకటరావు మరణం

ప్రముఖ స్వాంతంత్య్ర సమరయోధుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి కళా వెంకటరావు. 1900వ సంవత్సరం జూలై 7న ఏపీలోని అమలాపురం తాలూకా ముక్కామల గ్రామంలో జన్మించారు. 1921లో బీఏ చదువుతున్న సమయంలోనే సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. తరువాత శాసనోల్లంఘనోద్యమంలో, వ్యక్తి సత్యాగ్రహంలో, క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొని జైలు శిక్ష కూడా అనుభవించారు. కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేశారు. 1959 మార్చి 28న తుదిశ్వాస విడిచారు.

మరికొన్ని విశేషాలు:

  • 1891: మొదటి ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ జరిగింది.
  • 1922: అమెరికన్ ఆవిష్కర్త బ్రాడ్లీ ఎ. ఫిస్కే మైక్రోఫిల్మ్ రీడింగ్ పరికరానికి పేటెంట్ పొందారు.
  • 1930: టర్కీ తన అతిపెద్ద నగరం కాన్‌స్టాంటినోపుల్ పేరును ఇస్తాంబుల్‌గా మార్చింది.
  • 1941: గృహ నిర్బంధంలో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ కలకత్తా నుండి బెర్లిన్‌కు పారిపోయారు.
  • 2005: సుమత్రా దీవిలో సంభవించిన భూకంపం ఇండోనేషియా మొత్తాన్ని వణికించింది. ఈ భూకంపం 1965 తర్వాత నాల్గవ అతిపెద్ద భూకంపం

2 Comments

  1. Definitely consider that that you stated. Your favorite justification appeared to be on the net the easiest factor
    to take into account of. I say to you, I definitely get irked while folks consider issues that
    they plainly don’t understand about. You managed to hit the
    nail upon the top and defined out the entire thing without having side effect ,
    other people can take a signal. Will probably be again to get more.
    Thanks

    Here is my web-site – vpn special coupon

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button