తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

ఏప్రిల్ 25: చరిత్రలో ఈరోజు

ప్రపంచ మలేరియా దినోత్సవం

ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని నేడు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. మలేరియా వ్యాధి వ్యాప్తి, నిర్మూలన పట్ల అవగాహన కల్పించేందుకు గాను వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. 2007లో ప్రపంచ ఆరోగ్య సంస్థ సభ్యదేశాలన్నీ కలిసి ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించాయి.

గూగ్లిఎల్మో మార్కోని పుట్టినరోజు

ఇటాలియన్ శాస్త్రవేత్త, ఎలక్ట్రికల్ ఇంజనీర్ గూగ్లిఎల్మో జియోవన్ని మారియా మార్కోనీ 1874 ఇటలీలోని బొలోగ్నాలో జన్మించారు. సుదూర ప్రాంతాలకు రేడియో ప్రసారాలు పంపుటకు, రేడియో టెలిగ్రాఫ్ వ్యవస్థను అభివృద్ధి పితామహుడిగా పేరు గాంచారు. రేడియోను ఆవిష్కరించారు. 1909లో కార్ల్ ఫెడ్రినాండ్ బ్రాన్ తో కలిసి వైర్ లెస్ టెలిగ్రాఫీ అనే అంశంపై భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి తీసుకున్నాడు.

దేవిక పుట్టినరోజు

తెలుగు సినిమా నటి. 1960-70 దశకాల్లో హీరోయిన్ గా వెలిగిన దేవిక 1943 మద్రాస్ ప్రెసిడెన్సీలో జన్మించారు. తెలుగు, తమిళ, మలయాళంలో 150కి పైగా సినిమాల్లో నటించారు. ఈనె అసలు పేరు ప్రమీలాదేవి. వీరిది చిత్తూరు జిల్లా చంద్రగిరి. ఎన్టీఆర్ తో కలిసి హీరోయిన్ గా రేచుక్క అనే సినిమాలో తొలిసారి నటించారు. చివరిగా శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమాలో నటించారు.

బోయపాటి శ్రీను పుట్టినరోజు

తెలుగు సినిమా దర్శకుడు బోయపాటి శ్రీను 1971 గుంటూరు జిల్లా పెదకాకానిలో జన్మించారు. 2005లో రవితేజ, మీరా జాస్మిన్, ప్రకాష్ రాజ్ నటించిన భద్ర సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయమయ్యారు. తులసి రెండో చిత్రం. మూడో చిత్రం సింహా, నాలుగో మూవీ దమ్ము మూవీని తెరకెక్కించారు. ఇప్పటి వరకు 10 సినిమాలకు దర్శకుడిగా పనిచేశారు.

అండర్స్ సెల్సియస్ మరణం

స్వీడిష్ ఖగోళ, భౌతిక, గణిత శాస్ర్తవేత్త అండర్స్ సెల్సియస్ 1744 స్వీడన్ లోని ఉప్ప్సలలో మరణించారు. ఈయన 1701 నవంబర్ 27న స్వీడన్ లోని ఉప్ప్సలలో జన్మించారు. 1742లో ఉష్ణోగ్రతలను ప్రామాణికంగా కొలిచే సెంటిగ్రేడ్ ను ఈయన ప్రతిపాదించారు. అందుకే అతని గౌరవార్థం ఉష్ణోగ్రత కొలతల కోసం సెల్సియస్ అనే పేరును మార్చారు.

వసంతరావు వెంకటరావు మరణం

సైన్స్ రచయిత, శాస్త్రవేత్త, భౌతిక శాస్త్ర విజ్ఞాన ప్రచారకుడు వసంతరావు వెంకటరావు 1992 విజయనగరంలో మరణించారు. భౌతిక శాస్త్ర విజ్ఞానాన్ని ఉపన్యాసాలు, రచనల ద్వారా విస్తృత పరిధిలో వ్యాపింపచేసిన వెంకటరావు 1909 ఫిబ్రవరి 21న విజయనగరంలో జన్మించారు. తెలుగులో భౌతిక, రసాయన శాస్త్రాలకు సంబంధించిన పాఠ్యపుస్తకాలను తెలుగు భాషా తరపున రూపొందించారు.

టంగుటూరి సూర్యకుమారి మరణం

అలనాటి తెలుగు సినిమా నటి, ప్రసిద్ధ గాయకురాలు టంగుటూరి సూర్యకుమారి 2005 ఇంగ్లాండ్ లోని లండన్ లో మరణించారు. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు తమ్ముడు టంగుటూరి శ్రీరాములు కుమార్తె. ఈమె 1925 నవంబర్ 13న రాజమండ్రిలో జన్మించారు. 1952లో మిస్ మద్రాసు పోటీలో విజయం సాధించారు. 13 ఏళ్లకే రైతు బిడ్డ అనే సినిమాలో నటించారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో మొత్తం 26 సినిమాల్లో నటించారు.

ఆనం వివేకానంద రెడ్డి మరణం

ఆంధ్రప్రదేశ్ కి చెందిన రాజకీయనాయకుడు, టీడీపీకి చెందిన రాజకీయ వేత్త, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి 2018 హైదరాబాద్ లో మరణించారు. ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సోదరుడు. ఆయన 1950 డిసెంబర్ 25న నెల్లూరులో జన్మించారు. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999, 2004, 2009లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికయ్యారు.

మరిన్ని విశేషాలు

దక్షిణ భారత సినీ నటి మల్లికా కపూర్ 1987 ఢిల్లీలో జన్మించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో పలు చిత్రాల్లో నటించారు.

ప్రముఖ గణితశాస్త్రజ్ఞుడు ముదిగొండ విశ్వనాథం 1984 లో కన్నుమూశారు.

రామకృష్ణ మఠానికి చెందిన హిందూ స్వామి. రామకృష్ణ మఠం 13వ అధ్యక్షుడు స్వామి రంగనాథానంద 2005లో మరణించారు.

తెలంగాణ రాష్ట్ర సాహితీవేత్త, పద్యకవి డా. తిరునగరి రామానుజయ్య 2021 హైదరాబాద్ లో కన్నుమూశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button