తెలుగు
te తెలుగు en English
క్రీడలు

Asian Games 2023: తెలంగాణ పంచ్ రుచి చూపించిన నిఖత్.. ఒలంపిక్స్ కు సెలెక్ట్

ఆసియా గేమ్స్ 2023లో స్వర్ణమే లక్ష్యంగా బరిలో దిగిన భారత స్టార్‌ బాక్సర్‌, తెలంగాణ ముద్దు బిడ్డ నిఖత్‌ జరీన్‌ ఆ దిశగా మరో అడుగు ముందుకేసింది. ఒకే పంచ్‌తో రెండు విజయాలు సాధించింది.

అదే దూకుడు కొనసాగిస్తూ ఈ తెలంగాణ అమ్మాయి సెమీఫైనల్‌కు దూసుకెళ్లి మెడల్ ఖాయం చేసింది. శుక్రవారం జరిగిన 50 కేజీల క్వార్టర్‌ఫైనల్లో ప్రపంచ ఛాంపియన్‌ నిఖత్‌ జరీన్.. నాసర్‌ హనన్‌ (జోర్డాన్‌)ను చిత్తు చేసింది. బౌట్ ఆరంభం నుంచి ఎటాకింగ్‌ గేమ్‌ ఆడిన జరీన్‌.. ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యాన్ని చలాయించింది. చక్కని ఫుట్‌వర్క్‌, లెఫ్ట్‌, రైట్‌ హుక్‌ల మేళవింపుతో విరుచుకుపడి కేవలం 3 నిమిషాల్లోనే హనన్‌ను మట్టికరిపించింది.

హనన్‌ ఆటను కొనసాగించలేకపోవడంతో రిఫరీ బౌట్‌ను ఆపేసి నిఖత్‌ను విజేతగా ప్రకటించాడు. సెమీస్‌ చేరడం ద్వారా భారత స్టార్‌ కనీసం పతకం ఖాయం చేసుకుంది. ఈ విజయంతో 2024 పారిస్‌ ఒలింపిక్‌ కోటా బెర్తును కూడా దక్కించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button